వరసగా మూడు డిజాస్టర్లు చవిచూసిన రామ్ అభిమానులు బాగా బేజారై ఉన్నారు. డబుల్ ఇస్మార్ట్ మినిమమ్ గ్యారెంటీ హిట్టనే నమ్మకంతో ఎదురు చూస్తే అది తీవ్రంగా నిరాశపరచడం జీర్ణించుకోలేకపోతున్నారు. లైగర్ గాయాలను పూర్తిగా మాన్పుతుందనుకుంటే ఇంకా రెట్టింపు చేయడం పూరి జగన్నాధ్ ఫ్యాన్స్ ని కలవరపరుస్తోంది.
మంచి సీజన్, వరస సెలవులు, పోటీలో ఉన్న మిస్టర్ బచ్చన్ ఫెయిల్యూర్ ఇలా ఎన్నో అంశాలు కలిసి వచ్చినా వాడుకోలేకపోవడం ఎవరికైనా బాధ కలిగించేదే. మాస్ మూసలో పడి దారి తప్పిన ఎనర్జిటిక్ స్టార్ రామ్ కు ఒక సానుకూలాంశం కనిపిస్తోంది.
డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ లో ఉండగా కథలు విని రామ్ సానుకూలంగా స్పందించింది ఇద్దరు దర్శకులకు. వాటిలో మొదటిది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి డైరెక్టర్ మహేష్ బాబుతో. మొన్నామధ్యే లాంఛనంగా ప్రారంభమయ్యింది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లబోతోంది.
రామ్ కు ఇప్పుడు సెన్సిబుల్ దర్శకుల అవసరం చాలా ఉంది. ఒకప్పటి నేను శైలజ లాంటి రొమాంటిక్ ఎంటర్ టైనర్స్ కం లవ్ స్టోరీస్ లో చూడాలని ఫ్యామిలీ ప్రేక్షకులు కోరుకుంటున్నారు. మహేష్ బాబు ఎమోషన్స్ ని ఎంత బాగా హ్యాండిల్ చేస్తాడో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిలో చూశాం కాబట్టి ఈసారి కూడా వినోదాత్మక చిత్రం ఆశించవచ్చు.
సో రామ్ సరైన నిర్ణయం తీసుకుని సరైన ట్రాక్ లో పడ్డాడు. ఇంక రెండో ప్రాజెక్టు హరీష్ శంకర్ తో. ఇద్దరూ గతంలో ఓకే అనుకున్నారు కానీ ఇప్పుడు కార్యరూపం దాలుస్తుందా అంటే ఖరారుగా ఎస్ అని చెప్పలేని పరిస్థితి నెలకొంది.
ఖచ్చితంగా ఉంటుందనే హరీష్ శంకర్ చెబుతున్నారు కానీ రామ్ వైపు మరోసారి కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఇకనైనా అవసరానికి మించిన మాస్ పక్కనపెడితే సరైన కథలు కాంబోలు ఎంచుకుంటే రామ్ మార్కెట్ ఎక్కడికీ పోదు. ప్రతిసారి ఓపెనింగ్స్ దాన్నే స్పష్టం చేస్తున్నాయి. అంచనాలు కనక నిలబెట్టుకుంటే మహేష్ బాబు కూడా టాప్ లీగ్ లోకి వెళ్లిపోవచ్చు.
This post was last modified on August 26, 2024 1:37 am
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…