మలయాళ అమ్మాయి అయిన ప్రియాంక మోహన్‌కు తెలుగులో, తమిళంలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. సొంత భాష కంటే ఈ రెండు ఇండస్ట్రీల్లోనే ఆమె ఎక్కువగా సినిమాలు చేస్తోంది. ఈ గురువారం ఆమె సరిపోదా శుక్రవారం సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతోంది.
ఈ సందర్భంగా జరిగిన ప్రి రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ ఖుషి మూవీని పొగడ్డం, దానికి సీక్వెల్ తీయాలని దర్శకుడు ఎస్.జె.సూర్యను కోరడం తమిళ ప్రేక్షకులకు నచ్చలేదు. ఇందుకుగాను ఆమెను నిన్నట్నుంచి ట్రోల్ చేస్తున్నారు తమిళ నెటిజన్లు.
తెలుగు ఖుషికి ఎలివేషన్ ఇవ్వడం.. పవన్ కళ్యాణ్‌తో సీక్వెల్ తీయాలని ప్రియాంక.. సూర్యను కోరడమే తప్పయిపోయింది. తెలుగు ఖుషి కంటే తమిళ ఖుషి బాగుంటుందట. సీక్వెల్ చేయమని అడిగితే ముందు తమిళంలో విజయ్‌తో చేయాలని ఆమె అడగాలట. అలా కాకుండా పవన్‌తో ఖుషి-2 తీయమనడం ఏంటి అన్నది వాళ్ల అభ్యంతరం.
ఈ రీమేక్‌ల విషయంలో తమిళ జనాల గొడవ ఇప్పటిది కాదు. ఖుషి తమిళ వెర్షన్ కంటే తెలుగు వెర్షనే బెటర్ అని స్వయంగా ఎస్.జె.సూర్యనే గతంలో చెప్పాడు. తెలుగులో పవన్ కళ్యాణ్ మరిన్ని అడిషన్స్ చేయడంతో ఇంకా మెరుగు పడిందని.. తమిళంలో హిట్ అయిన సినిమా తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయిందని.. అందుకు పవన్ కళ్యాణే కారణమని ఆయన స్పష్టం చేశారు.
కానీ తమిళ జనాలకు మాత్రం విజయ్ ఖుషినే సూపర్ అన్నమాట. ఇదే తమిళ ప్రేక్షకులు.. ఒక్కడు కంటే దాని రీమేక్ అయిన గిల్లి సూపర్ అంటారు. రెండు సినిమాల్లో సన్నివేశాలు పక్కపక్కన పెట్టి చూస్తే మహేష్ బాబు ముందు విజయ్ తేలిపోతాడు.
తెలుగులో ఉన్న ఇంటెన్సిటీ తమిళఃలో కనిపించదు. కొన్ని సీన్లయితే మరీ కామెడీగా, వెటకారంగా ఉంటాయి. ఛత్రపతి, తమ్ముడు, పోకిరి సహా ఇంకా పలు చిత్రాలను విజయ్ రీమేక్‌ల పేరుతో చెడగొట్టాడన్నది ఆయా చిత్రాల్లో కీలక సన్నివేశాలు చూస్తే ఎవరికైనా అర్థమైపోతుంది. కానీ తమిళ జనాలు మాత్రం తమ సినిమాలే గొప్ప అనుకుంటూ అవతలి వాళ్లను తక్కువ చేసే ప్రయత్నం చేస్తుంటారు.
వ్యక్తిగత జీవితంలో నువ్వా నేనా అంటూ వివాదాలు, గొడవల్లో ఉంటున్న మంచు సోదరులు విష్ణు, మనోజ్ బాక్సాఫీస్ వద్ద కూడా…
రజనీకాంత్ లాంటి పెద్ద సూపర్ స్టార్. టాలీవుడ్ సీనియర్ మోస్ట్ అగ్ర హీరో నాగార్జున ప్రత్యేక పాత్ర. కన్నడలోనే బిజీగా…
మాములుగా ఏదైనా పెద్ద సినిమాకు పాటల రికార్డింగ్ జరిగిపోయాక వాటిని ఎప్పుడు షూట్ చేస్తారు, ఎంత టైంలో విడుదలవుతుందనేది మ్యూజిక్…
ఇటీవల విడుదలైన ఛావా సినిమాలో శంబాజి మహరాజ్ సీన్స్ చాలామందిని కదిలించాయి. ముఖ్యంగా ఔరంగజేబు క్యారెక్టర్ శంబాజిని అతి క్రూరంగా…
పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (PCB) ఇప్పటికే ఆర్థిక సమస్యలతో ఎదుర్కొంటుండగా, ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ మరింత కష్టాల్లోకి నెట్టేసింది. భారత్…
భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఖలిస్తానీ వేర్పాటువాద గ్రూప్ సిక్స్ ఫర్ జస్టిస్ (SFJ) పై కఠిన చర్యలు…