కమర్షియల్ లెక్కలు పక్కనపెడితే విజయ్ సేతుపతి విడుదల పార్ట్ 1 విమర్శకుల ప్రశంసలు అందుకున్న మాట వాస్తవం. తెలుగులో భారీ వసూళ్లు సాధించకపోయినా తమిళంలో సూపర్ హిట్ స్టేటస్ అందుకుని సీక్వెల్ మీద అంచనాలు పెంచేసింది. కమెడియన్ సూరిలో ఎంత సీరియస్ యాక్టర్ ఉన్నాడో ప్రపంచానికి పరిచయం చేసింది. దర్శకుడు వెట్రిమారన్ దీని మీద పూర్తి ఫోకస్ పెట్టి షూటింగ్ చేస్తున్నారు. మొదటి భాగం తెలుగులో విడుదల చేసిన గీతా ఆర్ట్స్ కొనసాగింపుని కూడా తీసుకొస్తున్నారు. అయితే ట్విస్టు ఏంటంటే ఇప్పటిదాకా షూట్ చేసిన నిడివి చూసి యూనిట్ కి మాట రావడం లేదట.
ఇంకా ముప్పై శాతం బ్యాలన్స్ ఉండగానే 4 గంటల 30 నిమిషాల లెన్త్ రావడం చూసి విడుదలకి మూడో భాగం ప్లాన్ చేసే ఆలోచనలో వెట్రిమారన్ ఉన్నట్టు చెన్నై టాక్. ఇటీవలే మహారాజా దెబ్బకు విజయ్ సేతుపతి ఇమేజ్, మార్కెట్ రెండూ పెరిగాయి. నెట్ ఫ్లిక్స్ లో వచ్చాక అంతర్జాతీయ ప్రేక్షకులు సైతం భేష్ అనడంతో ఇప్పుడు నిర్మాణంలో ఉన్న వాటి ఓటిటి హక్కులకు డిమాండ్ పెరుగుతోంది. అందుకే విడుదల పార్ట్ 3 వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే కాపీ ముందే సిద్ధం చేసి పెడతారు. రెండో భాగం రిలీజయ్యాక షూట్ చేయడం కాకుండా సమాంతరంగా పూర్తి చేస్తారు.
నక్సలైట్ల బ్యాక్ డ్రాప్ లో నడిచే విడుదలలో హృదయాన్ని మెలితిప్పే సన్నివేశాలు చాలా ఉంటాయి. ఒకప్పుడు పోలీస్ వ్యవస్థ ఎంత దారుణంగా ప్రవర్తించేదో కళ్ళకు కట్టినట్టు చూపించింది. ఒకప్పుడు కృష్ణవంశీ ఇలాంటి నేపథ్యంలోనే సిందూరం తీశారు. కానీ ఆ టైంలో ఆడియన్స్ కి నచ్చలేదు. తర్వాత ఏళ్ళు గడిచే కొద్దీ దానికి కల్ట్ స్టేటస్ వచ్చేసింది. విడుదలకు దీనికి చాలా దగ్గర పోలికలు ఉంటాయి. కానీ ఇప్పుడు వస్తున్న స్పందన వేరు. విడుదల 2లో ఎక్కువ భాగం విజయ్ సేతుపతి మీదే నడుస్తుంది. పార్ట్ 1 చివర్లో చూపించిన విజువల్స్ ని చాలా మటుకు రీ షూట్ చేశారని టాక్.
This post was last modified on August 25, 2024 8:56 am
అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో…
మాజీ సీఎం జగన్, వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రాకపోవడంపై ఏపీ శాసన మండలి సమావేశాల్లో పెను దుమారం రేగింది. జగన్…
వైసీపీ ఎంపీగా గెలిచిన కొద్ది నెలల తర్వాత ఆ పార్టీపై రఘురామకృష్ణరాజు తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సంగతి తెలిసిందే. నాలుగేళ్లపాటు…
వైసీపీ హయాంలో ఆ పార్టీ మద్దతుదారులు, సానుభూతిపరులు సోషల్ మీడియాలో ప్రత్యర్థి పార్టీల నేతలు, వారి కుటుంబ సభ్యులపై పెట్టిన…
ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు దీరి ఆరు మాసాలు కూడా కాలేదు. కేవలం ఐదు మాసాలు మాత్రమే పూర్తయింది. కానీ,…
వంశీ పైడిపల్లికి యావరేజ్ డైరెక్టర్ అని పేరుంది. అతను గొప్ప సినిమాలేమీ తీయలేదు. కానీ.. అతను కెరీర్లో ఇప్పటిదాకా పెద్ద…