Movie News

మహేష్ 29 క్యాస్టింగ్ నెటిజెన్లు నిర్ణయిస్తున్నారు

ఎస్ఎస్ఎంబి 29 ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. అధికారిక ప్రకటన ఎప్పుడు ఇవ్వాలో రాజమౌళి ఇంకా నిర్ణయించలేదు. విడుదల తేదీ గురించి అసలు ఆలోచనే లేదు. కానీ ఈలోగా రకరకాల లీకులు చక్కర్లు కొట్టేస్తున్నాయి. ముఖ్యంగా క్యాస్టింగ్ కు సంబంధించిన అప్డేట్స్ అసలు జక్కన్నకైనా తెలుసో లేదో అనేంత ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ముందు వచ్చిన పేరు పృథ్విరాజ్ సుకుమారన్. ఈయన విలన్ గా చేస్తున్నాడని ప్రచారం చేశారు. తర్వాత తంగలాన్ ఈవెంట్ లో విక్రమ్ మాటలను బట్టి కన్ఫర్మేషన్ లేకుండానే ఈ సినిమాలో ఆయన కూడా ఉన్నాడనే నిర్ధారణకు వచ్చేశారు.

వీళ్ళు కాకుండా నాగార్జున, మోహన్ లాల్, దీపికా పదుకునేలు ఈ లిస్టులో తోడయ్యారు. ఇంకొందరు అడుగు ముందుకేసి హీరోయిన్ గా చెస్లియా ఇస్లాన్ ఆన్ బోర్డ్ వచ్చేసిందని ఏకంగా ఫ్యాన్ మేడ్ పోస్టర్లు తయారు చేయించి చెలామణిలోకి తెచ్చేశారు. ఏతా వాతా తేలేదేమంటే వీటిలో ఒకటో రెండో లీకులు నిజమవ్వొచ్చేమో కానీ మిగిలినదంతా ఉత్తుత్తి ప్రచారమే. ఇప్పటికే రెండు మూడు వర్క్ షాపులు నిర్వహించిన రాజమౌళి తారాగణంలో ఎవరిని తీసుకోవాలనే దాని మీద స్పష్టమైన ఐడియాతోనే ఉంటారు. కాకపోతే ఆర్టిస్టుల కాల్ షీట్లు దొరికితే తప్ప ముందుకు వెళ్ళలేరు. లేదంటే ఆప్షన్లు మార్చాల్సి ఉంటుంది.

ఆర్ఆర్ఆర్ లాగా ఒక గ్రాండ్ ప్రెస్ మీట్ ద్వారా దీన్ని ప్రకటించాలని రాజమౌళి ఆలోచన. తొలుత మహేష్ బాబు పుట్టినరోజు ఆగస్ట్ 9 అనుకున్నారు కానీ పనంతా ఇంకా ప్రాధమిక దశలోనే ఉండటంతో ఆ ప్రతిపాదన మానుకున్నారు. ఎయిర్ పోర్ట్, ప్రైవేట్ ఈవెంట్స్ లో బయటికి వస్తున్న మహేష్ కొత్త లుక్స్ చూసి అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. అయితే టైటిల్ గరుడ అనుకుంటున్నారని, 2028లో రిలీజ్ ఉంటుందని కొన్ని హ్యాండిల్స్ చేస్తున్న హడావిడి మాత్రం శుద్ధ అబద్దం. ఏదైనా సరే రాజమౌళి లేదా శ్రీ దుర్గా ఆర్ట్స్ టీమ్ నుంచి వస్తే తప్ప నమ్మలేం సుమా.

This post was last modified on August 25, 2024 8:56 am

Share

Recent Posts

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

2 hours ago

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

2 hours ago

వీసా చేతిలో ఉన్నా రద్దే… అమెరికా కొత్త చెకింగ్ ఇదే!

అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…

2 hours ago

బొద్దింక‌ల నిర‌స‌న‌… ఈసారి ఇంకా గట్టిగా!!

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ).. తాజాగా మ‌రో ఉద్య‌మానికి తెర‌దీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్‌.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…

3 hours ago

ఆ పరిస్థితిలో హనుమాన్ చాలీసాను పఠించిన కెప్టెన్

హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్ర‌మించేవారు కొంద‌రైతే.. తాము చేసిన ప‌నుల కార‌ణంగా చూపిన ధైర్య సాహ‌సాల కార‌ణంగా రాత్రికి…

4 hours ago

చిన్న సినిమా సృష్టిస్తున్న సంచలనం పెద్దదే

కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…

6 hours ago