స్టార్ హీరోల సినిమాలు విడుదలకు సిద్ధం చేయడమే కాదు వాటి బుకింగ్స్ పట్ల శ్రద్ధ వహించి సరైన సమయంలో టికెట్ల అమ్మకాలు మొదలుపెట్టాలి. సరిపోదా శనివారం టీమ్ దీన్ని పర్ఫెక్ట్ గా ఆచరిస్తోంది. అయిదు రోజులు ముందుగానే బుక్ మై షో, పేటిఎం తదితర యాప్స్ ద్వారా బుకింగ్ ఓపెన్ చేయడంతో నిమిషాల వ్యవధిలోనే మూవీ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. మొదటి గంటకే వెయ్యికి పైగా టికెట్లను సేల్స్ లో చూపించింది. ప్రస్తుతం కొంత నెమ్మదించినా క్రమంగా ఇది ఊపందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక్కడ ప్లానింగ్ పద్ధతి అని చెప్పడానికి కారణముంది.
ఈ మధ్య కాలంలో పెద్ద చిత్రాల అడ్వాన్స్ బుకింగ్స్ మహా అయితే రెండు రోజుల ముందు మాత్రమే అందుబాటులోకి తెస్తున్నారు. ఇటీవల డబుల్ ఇస్మార్ట్ కొన్ని సెంటర్లలో ముందు రోజు మధ్యాన్నానికి కానీ బుకింగ్స్ పెట్టలేదు. మిస్టర్ బచ్చన్ కొంచెం అడ్వాన్స్ గా ఉంది అంతే. థియేటర్ అగ్రిమెంట్లు, డిస్ట్రిబ్యూటర్లతో మాటా మంతి, షోల కేటాయింపు ఇలా ఎన్నో వ్యవహారాలు చివరి నిమిషం వరకు ఒత్తిడి పెడుతూ ఉంటాయి. కానీ డివివి దానయ్య బృందం ఎలాంటి రిస్క్ రాకుండా పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగింది. నైజామ్ లో దిల్ రాజు లాంటి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ దొరకడం ప్లస్ అయ్యింది.
ఈ ఒక్క విషయంలోనే కాదు ప్రమోషన్లు, పబ్లిసిటీ ఇలా ప్రతిదాంట్లోనూ సరిపోదా శనివారం పక్కా స్ట్రాటజీని పాటించింది. ఒకరకంగా చెప్పాలంటే దీన్ని అందరూ ఫాలో కావాలి. దానికి హీరో కమిట్ మెంట్ కూడా తోడవ్వాలి. రెండు రోజుల వ్యవధిలో నాని ముప్పైకి పైగా ఇంటర్వ్యూలు ఇవ్వాల్సి వస్తే నో చెప్పకుండా పాల్గొనడం దానికి నిదర్శనం. చెన్నై, కోచి, బెంగళూరు, ముంబై ఇలా ఏ భాషను నిర్లక్ష్యం చేయకుండా అన్ని చోట్లా సినిమాను తీసుకెళ్లారు. బాలీవుడ్ లోనూ స్త్రీ 2 తర్వాత సరైన మాస్ బొమ్మ లేకపోవడంతో సూర్యాస్ సాటర్డే (హిందీ డబ్బింగ్) కు మంచి ఓపెనింగ్ వస్తుందనే నమ్మకం టీంలో ఉంది.
This post was last modified on August 25, 2024 8:57 am
సంక్రాంతి పండక్కు అందరికంటే ముందు వస్తున్న ఆనందం, అడ్వాంటేజ్ రెండూ గేమ్ ఛేంజర్ కు అనుకూలంగా ఉంటాయి. టాక్ పాజిటివ్…
టాలీవుడ్‌లో సమస్యలు ఎదురైనప్పుడు.. వాటిని పరిష్కరించే వ్యూహాలు.. చతురత ఉన్న ప్రముఖుల కోసం.. ఇప్పుడు నటులు, నిర్మాతలు ఎదురు చూసే…
ఐఏఎస్ అధికారి.. శ్రీలక్ష్మి గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా తెలుసు. దీనికి కారణం .. దేశంలోనే…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు మరో బీసీ మంత్రాన్ని పఠిస్తున్నారు. వారికి ఇప్పటికే.. సరైన సముచిత ప్రాధాన్యం కల్పించిన…
‘పవర్’ లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన బాబీ.. ఆ తర్వాత ‘సర్దార్ గబ్బర్ సింగ్’తో ఎదురు దెబ్బ…