Movie News

హరీష్ శంకర్ మీద రెట్టింపు ఒత్తిడి

విడుదలకు ముందు మిస్టర్ బచ్చన్ మీద అతి నమ్మకంతో ఓవర్ అటెన్షన్ తెచ్చుకోవాలని ప్రయత్నించిన హరీష్ శంకర్ అదిప్పుడు బూమరాంగ్ లా రివర్స్ కావడంతో షాక్ తిన్న వైనం బయటికి కనిపించకపోయినా అదే వాస్తవం. మిక్స్డ్ టాకని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ బాక్సాఫీస్ తీర్పు స్పష్టంగా వచ్చేసింది.

ఏదో అద్భుతం జరిగితే తప్ప ఈ వీకెండ్ కలెక్షన్ల నుంచి మేజిక్ ఆశించలేం. దానికి తోడు నిర్మాత టిజి విశ్వప్రసాద్ స్క్రిప్ట్ స్టేజిలోనే పొరపాట్లు జరిగాయని, సెకండాఫ్ లో హెచ్చుతగ్గులు ఉన్నాయని ఓపెన్ గా చెప్పేయడం జరిగిందేమిటో తేటతెల్లం చేసింది. ఇక అసలు మ్యాటర్ కొద్దాం.

ప్రస్తుతం హరీష్ శంకర్ మీద రెండు ఒత్తిళ్లు ఉన్నాయి. మొదటిది ఉస్తాద్ భగత్ సింగ్. ఇదీ రీమేకే. విజయ్ తేరి తెలుగులో పోలీసోడుగా వచ్చింది. థియేటర్ లో ఆడలేదు కానీ అమెజాన్ ప్రైమ్ లో బోలెడు మంది చూసేశారు. ఇప్పటికీ అందుబాటులో ఉంది.

అయినా సరే ఒరిజినల్ వెర్షన్ ని గుర్తుకరానంత గొప్పగా రీమేక్ చేస్తానని పలు సందర్భాల్లో నొక్కి వక్కాణించారు. అచ్చం మిస్టర్ బచ్చన్ కు చెప్పినట్టే. అలాంటప్పుడు ఉస్తాద్ మీద కూడా పవన్ కళ్యాణ్ అభిమానుల్లో సందేహం రావడం సహజం. షూటింగ్ ఇంకా టైం ఉంది కాబట్టి స్క్రిప్ట్ ని మరోసారి పునఃసమీక్షించుకోవడం అవసరం.

రెండోది రామ్ తో ప్రాజెక్టు. ది వారియర్, స్కంద, డబుల్ ఇస్మార్ట్ రూపంలో హ్యాట్రిక్ డిజాస్టర్లు చూసిన రామ్ సెలక్షన్ పట్ల ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తమ హీరో ఎనర్జీని చేతులారా వృధా చేస్తున్నారని దర్శకుల మీద మండిపడుతున్నారు.

ఇప్పుడీ కాంబో ఉంటుందో లేదోననే అనుమానాలు కొందరిలో తలెత్తుతున్నాయి. హరీష్ మాత్రం ఫ్యాన్ స్పీడ్ అయిదులో తిరిగేంత గొప్ప కథని సిద్ధం చేస్తానని అన్నారు. అదే నిజమైతే అంచనాలకు మించిన స్టోరీ రెడీ చేయాలి. ఫ్లాప్ వచ్చిన టైంలో దర్శకుల మీద చాలా బరువు ఉంటుంది. కాకపోతే హరీష్ శంకర్ మీద అది డబుల్ డోస్ లో ఉంది.

Share

Recent Posts

ఒక్క పిల్ల‌ర్‌పైనే వైసీపీ భారం… !

వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న పార్టీ. ఈ పార్టీ ప్ర‌భావం నానాటికి త‌గ్గిపోతోంద‌న్న వాద‌న ఒక‌వైపు…

1 hour ago

తండ్రీ కొడుకుల వెరైటీ క్లాష్

బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…

2 hours ago

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

10 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

10 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

11 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

11 hours ago