మాస్ మహారాజా రవితేజకు గాయమయ్యింది. ఇటీవలే తన 75వ సినిమా షూటింగ్ జరుగుతుండగా కుడి చేతి కండరాలకు దెబ్బ తగలడంతో యశోద ఆసుపత్రికి తరలించారు. సర్జరీ చేసిన డాక్టర్లు ప్రమాదం లేదని, ఆరు వారాలు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని చెప్పడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. నిజానికి ఈ యాక్సిడెంట్ గురించి లీక్స్ వచ్చినప్పటికీ హీరో పేరు నిర్ధారణగా తెలియకపోవడంతో విషయం పెద్దది కాలేదు. కానీ తాజాగా నిర్మాణ సంస్థ నుంచి క్లారిఫికేషన్ వచ్చేసింది. భాను భోగవరపు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ ఎంటర్ టైనర్ ని సితార బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
సంక్రాంతి విడుదలకు ప్లాన్ చేసుకున్న ఆర్టి 75 ఇప్పుడు ఏకంగా రెండు నెలలు బ్రేక్ తీసుకోవాల్సి రావడంతో అనుకున్న టైంకి రిలీజ్ కావడం అనుమానంగానే ఉంది. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా పూర్తి వినోదాత్మకంగా ఇది రూపొందుతోంది. సామజవరగమన రచయితల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న భాను భోగవరపు చెప్పిన స్టోరీ బాగా నచ్చేయడంతో రవితేజ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పండగకు తీసుకురావాలనే ఉద్దేశంతో వేగంగా చిత్రీకరణ అయ్యేందుకు పూర్తి సహకారం అందించారు. మిస్టర్ బచ్చన్ ప్రమోషన్ల కోసం చిన్న బ్రేక్ తప్ప పూర్తి ధ్యాస ఈ ప్రాజెక్టు మీదే ఉంది.
సరే సినిమా ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ ఆరోగ్యం ముఖ్యం కాబట్టి రవితేజ ఎంత అవసరమైతే అంతకన్నా ఎక్కువ రెస్ట్ తీసుకోవడం చాలా అవసరం. వయసు లెక్క చేయకుండా ఫుల్ ఎనర్జీతో వేగంగా సినిమాలు చేయడంలో యూత్ హీరోలను సైతం వెనుకపడేస్తున్న మాస్ మహారాజకి ఇది పెద్ద స్పీడ్ బ్రేకర్. ఇంత విశ్రాంతి తీసుకున్న దాఖలాలు గతంలో చాలా తక్కువ. ఎప్పటి నుంచి సెట్లో అడుగు పెడతారనేది వైద్యుల తదుపరి సూచన మీద ఆధారపడి ఉంటుంది. ఫైనల్ గా ఫ్యాన్స్ ఆందోళన చెందడానికి ఏమి లేదు. అయినా ఎనర్జీని శరీరంలోనే నింపుకున్న మనిషిని ఈ ప్రమాదాలు ఏం చేస్తాయి.
This post was last modified on August 23, 2024 5:41 pm
త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అత్యుత్తమమైన, విభిన్నమైన చిత్రాల్లో అరవింద సమేత ఒకటి. అందులో కీలక పాత్రలు పోషించిన ఆర్టిస్టులందరికీ మంచి…
సీనియర్ దర్శకుడు గుణశేఖర్ కెరీర్లో చూడాలని ఉంది, ఒక్కడు లాంటి బ్లాక్బస్టర్లతో పాటు సైనికుడు, వరుడు, నిప్పు లాంటి దారుణమైన…
స్మార్ట్ఫోన్ ప్రపంచంలో రియల్మీ సరికొత్త రికార్డు సృష్టించింది. గురువారం భారత మార్కెట్లో పీ4 పవర్ 5G ఫోన్ను విడుదల చేసింది.…
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. జనవరి 29 నాటి గణాంకాల ప్రకారం, కేవలం…
అమ్మాయిది అగ్రకులం... అబ్బాయిది వెనుకుబడిన కులం...ఇద్దరూ ప్రేమించుకున్నారు...కానీ, ఈ కులాంతర వివాహానికి అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు...ఆ తర్వాత ఆ ప్రేమ…
ఈ మధ్యకాలంలో పొలిటికల్ సౌండ్ తగ్గించిన ఏపీ కాంగ్రెస్ చీఫ్, వైఎస్ షర్మిల మళ్ళీ రంగంలోకి దిగారు. మహాత్మా గాంధీ…