Movie News

3 కోట్ల ఓపెనింగ్…ఇంద్ర ఫ్యాన్స్ హ్యాపీనా

నిన్న రీ రిలీజైన ఇంద్ర 3 కోట్ల 5 లక్షల గ్రాస్ సాధించినట్టు నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ అధికారికంగా ప్రకటించింది. నిజానికి మెగాభిమానులు ఈ నెలలోనే వచ్చిన మురారి రికార్డులను బద్దలు కొడుతుందని ఆశించారు కానీ అది నెరవేరే సూచనలు తక్కువగా ఉన్నాయి. అయితే ఒక ప్రత్యేక మైలురాయి మాత్రం ఇంద్ర అందుకుంది. ఇప్పటిదాకా సీనియర్ హీరోల రీ రిలీజుల్లో అత్యధిక రెవిన్యూ సాధించిన చిత్రంగా నిలిచింది. ఇంకా రన్ కొనసాగుతుంది కాబట్టి అప్పుడే నిర్ధారణకు రాలేం. మన్మథుడు, చెన్నకేశవరెడ్డి, నరసింహనాయుడు లాంటివి బాగా దూరంలో ఉన్నాయి.

అయితే ఇంద్ర స్టామినా ఎంతనే ప్రశ్న వేసుకుంటే దాని స్థాయికి తగ్గట్టు ఫిగర్లు నమోదు కాలేదనేది వాస్తవం. ఎందుకంటే ప్రమోషన్లకు కేవలం వారం రోజులే పెట్టుకోవడంతో పాటు థియేటర్ కేటాయింపు విషయంలో జరిగిన ఆలస్యం వసూళ్ల మీద ప్రభావం చూపించింది. పైగా ఆయ్ మంచి ఊపులో ఉండగా, తంగలాన్ కు సైతం స్క్రీన్లు పెరిగాయి. ఫ్లాప్ అయినా సరే అగ్రిమెంట్ల వల్ల మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ లకు రెండో వారంలో చెప్పుకోదగ్గ షోలైతే ఇచ్చారు. ఆగస్ట్ రెండో వారంలో వచ్చిన కమిటీ కుర్రాళ్ళు, బాలీవుడ్ బ్లాక్ బస్టర్ స్త్రీ 2 వల్ల మల్టీప్లెక్సుల్లోనూ ఎక్కువ షోలు దొరకలేదు.

ఈ వీకెండ్ గరిష్టంగా ఎంత రాబడుతుందనేది ఇంద్రకు కీలకంగా నిలుస్తుంది. ఎందుకంటే సరిపోదా శనివారం ఆగస్ట్ 29 వచ్చేస్తుంది. నాగార్జున మాస్ ఒక రోజు ముందు 28న రీ రిలీజ్ చేస్తున్నారు. సో వీలైనంత వసూలు చేసుకోవడం ఇంద్రకి కీలకం. లెక్కల సంగతి పక్కనపెడితే ఇంద్రని ఒక పండగలా సింగల్ స్క్రీన్లలో ఎంజాయ్ చేయడం వీడియోల రూపంలో తెగ వైరలయ్యింది. ఏబీసీ సెంటర్ అనే తేడా లేకుండా ఫ్యాన్స్ వెల్లువలా ఇంద్రని మొదటి రోజు చూశారు. గురువారం వీక్ డే కావడం కొంత ప్రభావం చూపించినా ఫైనల్ గా మర్చిపోలేని అనుభూతిని అందుకున్నామని ఫ్యాన్స్ సంబరపడ్డారు.

This post was last modified on August 23, 2024 5:14 pm

Share

Recent Posts

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

12 minutes ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

20 minutes ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

35 minutes ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

37 minutes ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

3 hours ago

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

3 hours ago