నిన్న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఇంద్ర రీ రిలీజ్ ని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నారు. ముఖ్యంగా సింగల్ స్క్రీన్లలో కొత్త సినిమా వచ్చినంత రేంజ్ లో హడావిడి జరిగింది. దీని దెబ్బకు విశ్వంభర కొత్త పోస్టర్ అంతగా హైలైట్ కాకపోవడం అసలు ట్విస్టు.
వీటి సంగతి పక్కనపెడితే మెగా 157 ప్రకటన వస్తుందేమోనని ఫ్యాన్స్ ఎదురుచూశారు కానీ అది జరగలేదు. ఇప్పుడు చేస్తున్న విశ్వంభర షూటింగ్ దాదాపు కొలిక్కి వచ్చింది. ఇంకొంత టాకీ పార్ట్, ఒక పాట అయిపోతే గుమ్మడికాయ కొట్టడమే బ్యాలన్స్. అయినా సరే కొత్త ప్రాజెక్టు ఇప్పటిదాకా లాక్ కాలేదు.
గత ఏడాది భోళా శంకర్ ఇచ్చిన షాక్ కి చిరంజీవి తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం లేదు. వయసుని దృష్టిలో పెట్టుకుని ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కూతురు సుస్మిత నిర్మాణంలో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఒక చేసిన సినిమాని క్యాన్సిల్ చేసుకున్నారు.
గాడ్ ఫాదర్ ఫేమ్ మోహన్ రాజాకు మరో అవకాశం ఇచ్చారనే టాక్ రెండు నెలల నుంచి ఫిలిం నగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది కానీ ఇప్పటిదాకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ లేదు. బివిఎస్ రవి స్టోరీ ఓకే అయినా దర్శకుడి ఎంపిక దగ్గరే పేచీ వచ్చిందని అంటున్నారు. ప్రస్తుతం చిరు ఎలాంటి డెసిషన్ తీసుకోలేదట.
అనుదీప్, హరీష్ శంకర్, మారుతీ తదితరులంతా వివిధ మార్గాల్లో చిరంజీవికి కథలు చెప్పినవాళ్ళే కానీ ఎవరూ గ్రీన్ సిగ్నల్ తెచ్చుకోలేకపోయారు. విశ్వంభర బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం మెగాస్టార్ లో పుష్కలంగా ఉందట. అందుకే ఇకపై ఫార్ములా మాస్ కి దూరంగా విభిన్నమైన ప్రయోగాలు చేసేందుకు రెడీ అవుతున్నారని సన్నిహిత వర్గాల మాట.
రజనీకాంత్ జైలర్ తరహా కాన్సెప్ట్స్ తనకు బాగా సూటవుతాయి కాబట్టి ఆ కోణంలో ఆలోచించమని పలువురు రచయితలకు సూచనలు ఇచ్చారట. సో మెగా 157 తాలూకు క్లారిటీ రావాలంటే ఇంకొన్ని నెలలు లేదా వారాలు వెయిట్ చేయాల్సిందే.
This post was last modified on August 23, 2024 11:36 am
శివ కార్తికేయన్.. తమిళంలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా మొదలు పెట్టి స్టార్గా ఎదిగిన హీరో. తన జర్నీ గురించి తెలిస్తే…
శాసన సభ సమావేశాలను వైసీపీ బాయ్ కాట్ చేయడంపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. తమకు మైక్ ఇవ్వడం లేదని…
ఇప్పుడంటే తమన్, అనిరుధ్, డీఎస్పి అంటూ కొత్త తరం సంగీతంలో మునిగి తేలుతున్నాం కానీ ఒకప్పుడు విలక్షణమైన మ్యూజిక్, విభిన్నమైన…
భూషణ్ కుమార్ అంటే మన ప్రేక్షకులకు వెంటనే ఫ్లాష్ కాకపోవచ్చు కానీ ఆదిపురుష్, యానిమల్, స్పిరిట్ లాంటి భారీ ప్యాన్…
ఫిలిం ఇండస్ట్రీలో ప్రేమాయణాలు.. బ్రేకప్లు సర్వ సాధారణమే. ఐతే బాలీవుడ్లో ఈ ఒరవడి ఎక్కువ కాగా.. సౌత్ ఇండస్ట్రీల్లో కొంచెం…
మన దేశంలో చాలామంది ఆడవాళ్లు సాధారణంగా ఐదు పదుల వయసు తర్వాత ఏ టీవీ సీరియల్సో చూసుకుంటూ మనవళ్లతో ఆడుకుంటూ…