వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీదత్, మెగాస్టార్ చిరంజీవి మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉంది. టాలీవుడ్ లో గర్వంగా చెప్పుకోదగ్గ గ్రాండియర్లు, బ్లాక్ బస్టర్లు వీళ్ళ కాంబోలో వచ్చాయి. ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ గురించి ఇప్పటికీ బోలెడు ముచ్చట్లు పలు ఇంటర్వ్యూలలో దానికి పని చేసినవాళ్లు చెబుతూనే ఉంటారు. 1990లో వచ్చిన ఈ విజువల్ ఫీస్ట్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రాఘవేంద్రరావు దర్శకత్వం, శ్రీదేవి గ్లామర్, ఇళయరాజా పాటలు, అమ్రిష్ పూరి విలనిజం, ఆ రోజుల్లోనే భారీ బడ్జెట్ వగైరాలన్నీ దాన్నో మాస్టర్ పీస్ గా చెప్పుకునేలా చేశాయి.
ఆ తర్వాత ‘చూడాలని ఉంది’ మరో మైలురాయి. గుణశేఖర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ చైల్డ్ సెంటిమెంట్ యాక్షన్ డ్రామా అప్పట్లో రికార్డులు బద్దలు కొట్టింది. మణిశర్మ బెస్ట్ ఆల్బమ్స్ లో దీనికి ప్రత్యేక స్థానం ఉంటుంది. కోల్కతా బ్యాక్ డ్రాప్ లో తీసిన ఈ సినిమా ద్వారానే ప్రకాష్ రాజ్ కు పెద్ద బ్రేక్ దొరికింది. ఆ తర్వాత ‘ఇంద్ర’ గురించి చెప్పుకుంటూ పోతే పేజీలు చాలవు. ఇండస్ట్రీ హిట్ గా నిలిచి ఇరవై రెండు సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ అలరిస్తోందంటే కమర్షియల్ చిత్రాల్లో ఇది ఎంత బలమైన ముద్ర వేసిందో అర్థం చేసుకోవచ్చు. ‘జై చిరంజీవ’ ఈ కాంబోలో వచ్చిన నాలుగో మూవీ.
విజయ్ భాస్కర్ దర్శకత్వంలో త్రివిక్రమ్ రచన చేసిన ఈ రివెంజ్ డ్రామా ఒక్కటే అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. పాటలు, డాన్సులు, సెంటిమెంట్ వగైరాలు బాగా కుదిరినా బాక్సాఫీస్ వద్ద మేజిక్ చేయలేకపోయింది. ఫ్లాపే కానీ మరీ డిజాస్టర్ కాదు. త్వరలో అయిదో సినిమా తీస్తానని ప్రకటించారు అశ్వినిదత్. చిరంజీవికి శుభాకాంక్షలు అందజేస్తూ విడుదల చేసిన వీడియోలో శుభవార్త చెప్పారు. అయితే కథా దర్శకుడు కుదరాలి. కల్కి 2898 ఏడి లాంటి ప్యాన్ ఇండియా మూవీ తీసిన దత్తుగారు నిజంగా మెగాస్టార్ తో జట్టు కడితే హద్దుల్లేని బడ్జెట్ తో విజువల్ వండర్ ఇస్తారనడంలో డౌట్ లేదు.
This post was last modified on August 22, 2024 6:32 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…