రీ రిలీజుల ట్రెండ్ అయిపోయిందేమో అనుకున్న ప్రతిసారి ఏదో ఒక బ్లాక్ బస్టర్ అది నిజం కాదని ఋజువు చేస్తుంది. సెంటిమెంట్ సినిమా మురారిని ఎవరు చూస్తారులే అనుకుంటే ఏకంగా రికార్డులు సృష్టించేసింది. తాజాగా ఇంద్ర సైతం అదే బాటలో ఉంది. ఇవాళ మళ్ళీ విడుదలైన ఈ మెగా ఇండస్ట్రీ హిట్ ఏపీ, తెలంగాణ సింగల్ స్క్రీన్లను కళకళలాడించేసింది. 380కి పైగా థియేటర్లలో సురేష్ ఏషియన్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా నిర్మాత అశ్వినిదత్ భారీ ఎత్తున ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చారు. గురువారం పీక్ వర్కింగ్ డే అయినా తెల్లవారుఝామునే అభిమానులు హౌస్ ఫుల్ బోర్డులు పెట్టేశారు.
క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య, సుదర్శన్, దేవి, తారకరామ మొదలైనవన్నీ కిక్కిరిసిపోయే జనంతో ఉదయం ఏడు గంటల నుంచే సందడిగా మారిపోయాయి. ఈ సంబరాలు ఇక్కడికే పరిమితం కాలేదు. బెంగళూరు సంధ్య థియేటర్లో తెల్లవారుఝామున అయిదు నుంచే ఫ్యాన్స్ హడావిడి చేయడం మొదలుపెట్టారు. గుంటూరు, కర్నూలు, విజయవాడ, మెహబూబ్ నగర్, వైజాగ్ తదితర నగరాల్లో అన్ని చోట్ల ఇదే పరిస్థితి. హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లార్జ్ స్క్రీన్ లో అయిదు షోలు ఇస్తే ఎనభై శాతం పైగా ఆక్యుపెన్సీ నమోదు కావడం గమనించాల్సిన విషయం. ఇంద్ర ఫీవర్ ఆ రేంజ్ లో ఉంది.
గత వారం వచ్చిన కొత్త సినిమాలు తీవ్రంగా నిరాశపరచడంతో మాస్ ఈసారి ఇంద్రని ఎంచుకున్నారు. అయితే ఈ జోరు ఎన్ని రోజులు ఉంటుందనేది చెప్పలేం. ఆదివారం దాకా స్టడీగా ఉన్నా పెద్ద ఫిగర్లతో వసూళ్లను క్లోజ్ చేయొచ్చు. కంప్లీట్ కమర్షియల్ ప్యాకేజీగా చెప్పుకునే ఇంద్రలో చిరంజీవి నటన, మణిశర్మ పాటలు, బీజీఎమ్, దాయి దాయి దామ్మా వీణ స్టెప్పు, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, షౌకత్ అలీ ఖాన్ ట్రాక్ ఒకటేమిటి చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే అవుతుంది. ఇప్పుడే ఇలా ఉంటే సెప్టెంబర్ 2న గబ్బర్ సింగ్ రాకతో సెలబ్రేషన్స్ మరో స్థాయికి వెళ్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పెద్ద ప్లానింగే జరుగుతోంది.
This post was last modified on August 22, 2024 6:13 pm
ఇటీవల సినీ ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పదవులు కట్టబెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.…
సంక్రాంతి పండక్కు వస్తామని జనవరి 12 డేట్ వేసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు ఆ తర్వాత పూర్తిగా…
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…
మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…
ఒక గంట కునుకు పడితే ఎక్కడ పనికి బ్రేక్ పడుతుందో అన్న రేంజ్ లో చివరి దశ ప్యారడైజ్ పనులను…
దేవుడు నుదుటి మీద రాసే రాతైనా అర్ధం అవుతుందేమో కానీ వైద్యుడు రాసే మందుల పేర్లు మాత్రం అర్ధం కావన్నది…