Movie News

రేపే విడుదల – సందడి ఎవరిదో

ఇంకో శుక్రవారం వచ్చేస్తోంది. ఆగస్ట్ 15 విడుదలైన డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ తీవ్రంగా నిరాశ పరచగా తంగలాన్ మొదటి మూడు రోజులు బాగానే రాబట్టినా తర్వాత నెమ్మదించింది. ఒక్క ఆయ్ మాత్రమే అంచనాలకు మించి ఆడి పది కోట్ల గ్రాస్ కు దగ్గరగా వెళ్ళింది. అయితే అన్ని థియేటర్ల ఫీడింగ్ కి దీన్నే వేయలేరు కాబట్టి ఎగ్జిబిటర్లు కొత్త ఫ్రైడే మీద ఆశలు పెట్టుకున్నారు. ముందుగా చెప్పుకోవాల్సింది ‘మారుతినగర్ సుబ్రహ్మణ్యం’ గురించి. అల్లు అర్జున్ గెస్టుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపడం వల్ల జనాల దృష్టి దీని మీద పడింది. సుకుమార్, మైత్రి బ్యాకప్ ఉండటంతో మంచి థియేటర్లు దక్కుతున్నాయి.

రావు రమేష్ ప్రధాన పాత్ర పోషించిన ఈ కామెడీ ఎంటర్ టైనర్ టాక్ తో నిలబడుతుందని టీమ్ నమ్ముతోంది. ఇవాళ సాయంత్రమే హైదరాబాద్ లో స్పెషల్ ప్రీమియర్ వేస్తున్నారు. తమిళ డబ్బింగ్ ‘డిమాంటీ కాలనీ 2’ మొన్నే ఓ షో వేశారు. రెస్పాన్స్ పాజిటివ్ గానే ఉంది. హారర్ ఎలిమెంట్స్ తో రూపొందిన ఈ సీరియస్ డ్రామా ఈ జానర్ అభిమానులకు విపరీతంగా నచ్చేస్తుందనే అంచనాలు బలంగా ఉన్నాయి. ఇవి కాకుండా రేవు, బ్రహ్మవరం, యజ్ఞ, వెడ్డింగ్ డైరీస్ అనే మరో నాలుగు చిన్న చిత్రాలు రేసులో ఉన్నాయి. హాలీవుడ్ మూవీ ‘ఎలియన్ రొమ్యులస్’ని అనువాద రూపంలో తెస్తున్నారు.

ఇవన్నీ ఈ వారమే ఋజువు చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆగస్ట్ 29 సరిపోదా శనివారం భారీ హైప్ మధ్య రిలీజవుతోంది. నాని ప్రమోషన్ల కోసం చాలా తిరిగాడు. ఖచ్చితంగా బ్లాక్ బస్టరవుతుందనే నమ్మకంతో రాష్ట్రాలు రౌండ్ వేసొచ్చాడు. చాలా ఓపిగ్గా ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు చేస్తున్నారు. సో పైన చెప్పిన సినిమాలు ఆయ్, కమిటీ కుర్రోళ్ళు రేంజ్ లో టాక్ తెచ్చుకుంటేనే సెకండ్ వీక్ లో నిలబడగలుగుతాయి. లేదంటే కష్టం. ఈ నెలంతా కంటెంట్ ఉన్న సినిమాలే గెలిచాయి కాబట్టి అదే సెంటిమెంట్ ఫాలో అవుతూ ఎవరు విజేతలుగా నిలుస్తారో రేపీపాటికి తేలిపోతుంది. చూద్దాం.

This post was last modified on August 22, 2024 12:11 pm

Share

Recent Posts

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

1 hour ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

2 hours ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

2 hours ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

4 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

4 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

4 hours ago