ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్డే. వాళ్ల సినిమాల రీచ్, బడ్జెట్లు, బిజినెస్ అన్నీ కూడా వేరే లెవెల్లో ఉండేవి. ప్రాంతీయ భాషా చిత్రాలు వాటిని అందుకోలేని స్థాయిలో ఉండేవి. కానీ ఇప్పుడు కథ రివర్స్ అయింది. ప్రాంతీయ చిత్రాలు దేశవ్యాప్తంగా సంచలన విజయాలు నమోదు చేస్తున్నాయి. హిందీ చిత్రాల పరిధి తగ్గిపోతోంది.
గతంలో బాలీవుడ్ వాళ్లు రీజనల్ సినిమాలను.. వాటిలో భాగమైన వాళ్లను తక్కువగా చేసి మాట్లాడేవాళ్లు. ఇప్పటికీ ఆ ఒరవడి కొంత కొనసాగుతోందనడానికి ఇటీవల బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి.. మన ప్రభాస్ మీద చేసిన వ్యాఖ్యలు రుజువు. ఐతే ఇప్పుడు ఓ ప్రాంతీయ నటుడు, దర్శకుడు బాలీవుడ్ తీరును ఎండగట్టే వ్యాఖ్యలు చేశాడు. అతనే.. 2023 సంవత్సరానికి జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికైన రిషబ్ శెట్టి.
రిషబ్ కొంచెం ఔట్ స్పోకెన్ అని గతంలోనే రుజువైంది. ఇప్పుడు అతను బాలీవుడ్ మీద ఘాటు వ్యాఖ్యలే చేశాడు. భారతీయ చిత్రాలు.. ముఖ్యంగా బాలీవుడ్ మూవీస్ ఎప్పుడూ మన దేశాన్ని, సంస్కృతిని తక్కువ చేసి చూపిస్తుంటాయని విమర్శించాడు రిషబ్. ఈ తరహా ఆర్ట్ చిత్రాలకు ఇంటర్నేషనల్ లెవెల్లో రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలుకుంతుంటాయని.. ఇలా సినిమాలు తీయాల్సిన అవసరం ఏముందని రిషబ్ ప్రశ్నించాడు.
ఐతే తన దేశం, తన రాష్ట్రం, తన సంస్కృతిని గొప్పగా చూపించాలన్నది తన ఉద్దేశమని.. ఆ విషయంలో తాను గర్విస్తానని కాంతార స్టార్ చెప్పాడు. రిషబ్ నిర్మాణంలో తెరకెక్కిన కొత్త చిత్రం లాఫింగ్ బుద్ధ కూడా కాంతార తరహాలోనే లోకల్ కల్చర్‌ను గొప్పగా చూపించబోతున్న చిత్రమట. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ సినిమాల తీరును ఎండగడుతూ రిషబ్ ఈ కామెంట్స్ చేశాడు. ఈ అభిప్రాయంతో నార్త్ జనాలు కూడా ఏకీభవిస్తుండడం విశేషం.
This post was last modified on August 21, 2024 2:28 pm
నిన్న రాత్రి హఠాత్తుగా దేశవ్యాప్తంగా ఉన్న పివిఆర్ ఐనాక్స్ మల్టీప్లెక్సుల్లో పుష్ప 2 ది రూల్ బుకింగ్స్ తీసేయడం సంచలనమయ్యింది.…
టాలీవుడ్ లో సంగీత దర్శకుల కొరత గురించి చెప్పనక్కర్లేదు. తమన్, దేవిశ్రీ ప్రసాద్ ని అందరూ తీసుకోలేరు. పైగా వాళ్ళు…
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన ఆటతో మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితంతో కూడా నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు.…
2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో స్కామ్ జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న…
ఈ టెక్ జమానాలో ఆడియో, వీడియో ఎడిటింగ్ లు పీక్ స్టేజికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక, ఏఐ, డీప్…