చిన్న హీరో అయినా రెగ్యులర్ ఫార్ములాకు భిన్నంగా సినిమాలు చేస్తున్న సుహాస్ కు ఈ ఏడాది రిలీజ్ కౌంట్ పరంగా మంచి నెంబరే దక్కనుంది.తన కొత్త చిత్రం జనక అయితే గనక సెప్టెంబర్ ఏడున విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆయన కూతురు హన్షిత రెడ్డి నిర్మించిన బలగం బ్లాక్ బస్టర్ అయ్యింది. తర్వాత లవ్ మీ ఇఫ్ యు డేర్ డిజాస్టరయ్యింది. ఇప్పుడు కాన్సెప్ట్, కంటెంట్ ని నమ్ముకుని జనక అయితే గనకని తీసుకొస్తున్నారు. లక్కీ భాస్కర్ తప్పుకోవడంతో వెంటనే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంది.
దిల్ రాజు దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోబోతున్నట్టు ఇన్ సైడ్ టాక్. ఫ్యామిలీ, యూత్ ఇద్దరినీ ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా ఉండటంతో మంచి బిజినెస్ తో పాటు థియేటర్ల విషయంలో జాగ్రత్తలు తీసుకుని ప్రీమియం స్క్రీన్లు వచ్చేలా చూస్తున్నారట. దీనికి రెండు రోజుల ముందు విజయ్ ‘ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం గోట్’ భారీ అంచనాల మధ్య రిలీజవుతోంది. తెలుగులోనూ గ్రాండ్ గా ప్లాన్ చేశారు. దాన్ని తట్టుకోవడం సుహాస్ లాంటి చోటా హీరోకి అంత సులభం కాదు. కానీ వెనుక దిల్ రాజు ఉన్నారు కాబట్టి మొత్తం ఆయనే నడిపిస్తారు. టాక్ రావడం ఆలస్యం దాన్నెలా నిలబెట్టాలో చూసుకుంటారు.
ఈ రకంగా చూస్తే సుహాస్ రొట్టె విరిగి నేతిలో పడినట్టే. మాములుగా ఇతర నిర్మాత అయితే గోట్ కు ఎదురెళ్ళే సాహసం చేయడు. కానీ దిల్ రాజు లెక్కలు వేరుగా ఉన్నాయి. రాజ్ తరుణ్ భలే ఉన్నాడే కాంపిటీషన్ లో ఉంది కానీ హీరో మార్కెట్ కోణంలో చూస్తే భయపడాల్సిన పని లేదు. నారా రోహిత్ సుందరకాండ సైతం ఎలాంటి సౌండ్ చేయడం లేదు కాబట్టి దాదాపు వాయిదా పడినట్టే. సో జనక బాగుందని అనిపించుకుంటే చాలు ఆయ్, కమిటీ కుర్రోళ్ళు తరహాలో హిట్టు కొట్టేయొచ్చు. ఈ కామెడీ ఎంటర్ టైనర్ లో సంగీర్తన హీరోయిన్ గా నటించగా సందీప్ బండ్ల దర్శకత్వం వహించారు.
This post was last modified on August 21, 2024 11:42 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…