ఇండిపెండెన్స్ డే వీకెండ్లో మాస్ సినిమాలు మోతెక్కించేస్తాయిని అంతా అనుకున్నారు. ప్రేక్షకుల దృష్టి కూడా ప్రధానంగా మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ మూవీస్ మీదే నిలిచింది. ఇవి రెండూ బాక్సాఫీస్‌ను ఊపేస్తాయని అనుకున్నారు. కానీ చిన్న సినిమా ఆయ్ ఊపిన ఊపుకి ఇవి కొట్టుకు పోయే పరిస్థితి నెలకొంది.
ముందేమో ఇలాంటి క్రేజీ సినిమాల మధ్య ఆయ్ అనే చిన్న సినిమా పోటీకి వెళ్లడం అవసరమా అన్నప్రశ్న తలెత్తింది. పెద్ద సినిమాల మధ్య ఇది నలిగిపోతుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ తీరా చూస్తే నెగెటివ్ టాక్ తెచ్చుకున్న మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ ఆరంభ మెరుపులతో సరిపెట్టాయి. వీకెండ్లోనే వీటికి ప్రేక్షకులు తగ్గిపోయారు. మరోవైపు ఆయ్ షో షోకూ ప్రేక్షకాదరణ పెంచుకుంటూ పోయింది. ముందు పరిమిత థియేటర్లలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయగా.. తర్వాత స్క్రీన్లు, షోలు పెరిగాయి. వీక్ డేస్‌లో కూడా మంచి ఆక్యుపెన్సీలతో నడుస్తోంది ఆయ్ మూవీ.
ఆయ్ మాత్రమే కాదు.. ముందు వారంలో రిలీజైన కమిటీ కుర్రోళ్లు కూడా ఇంకా బాగా ఆడుతోంది. ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. వసూళ్లు కూడా క్రమంగా పెరుగుతూ వెళ్లాయి. ఈ రెండు చిత్రాల్లోనూ స్టార్ హీరోలు లేరు. విడుదలకు ముందు వీటికి పెద్దగా బజ్ లేదు. కేవలం కంటెంట్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. పేరున్న నటీనటులు లేకున్నా..కొత్త, పెద్దగా పేరు లేని నటీనటులు, సాంకేతిక నిపుణులే ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
ఆడియన్స్ కూడా స్టార్లున్నారా అని చూడకుండా కంటెంట్ చూసి ఈ సినిమాలను ప్రోత్సహించారు. టాక్ తెలుసుకుని ఈ సినిమాలు ఆడుతున్న థియేటర్లకు కదిలారు. దీన్ని బట్టి సరైన కథ లేకుండా కాంబినేషన్ క్రేజ్‌తో సినిమాలు లాగించేయడం కంటే.. పేరున్న ఆర్టిస్టులు, టెక్నీషియన్లు లేకపోయినా బలమైన కంటెంట్ ఉంటే చాలు అని మరోసారి రుజువైంది. ఈ రెండు చిన్న సినిమాల స్ఫూర్తితో అయినా మేకర్స్ కంటెంట్ మీద మరింత దృష్టిపెడతారని ఆశిద్దాం.
This post was last modified on August 21, 2024 7:41 am
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
బీజేపీ మాతృ సంస్థ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్).. తాజాగా కమల నాథులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…