ఎన్నికల ఫలితాలు.. సినీ, రాజకీయ ప్రముఖుల మీద జోస్యాలు చెప్పడం ద్వారా సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ సంపాదించిన వ్యక్తి వేణు స్వామి. ఆయన చెప్పిన జోస్యాల్లో చాలా వరకు ఫెయిలైనప్పటికీ.. సోషల్ మీడియాకు ఎప్పటికప్పుడు కంటెంట్ ఇస్తుంటాడని ఆయన్ని ఫాలో అవుతుంటారు. తన వీడియోలకు కూడా మంచి రీచ్ వస్తుంటుంది.
ఐతే ఈ మధ్య వేణు స్వామి హద్దులు దాటాడు.నాగచైతన్య, శోభిత నిశ్చితార్థం చేసుకున్న రోజే.. వీళ్లిద్దరూ మూడేళ్లలో విడిపోతాడంటూ జోస్యం చెప్పి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆయన మీద మహిళా కమిషన్లో ఫిర్యాదు కూడా చేశారు. మరోవైపు టీవీ ఛానెళ్లలో వేణుస్వామికి వ్యతిరేకంగా చర్చలు కూడా జరిగాయి. ఈ క్రమంలోనే తమను ఐదు కోట్లు డిమాండ్ చేస్తున్నాడంటూ వేణు స్వామి, ఆయన భార్య.. జర్నలిస్ట్ మూర్తి తదితరుల మీద ఆరోపణలు చేశారు.
ఇలా వేణు స్వామి పేరు చర్చనీయాంశం అవుతున్న తరుణంలో.. పీఆర్వో టర్న్డ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ ఆయన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు ఫిలిం జర్నలిస్టులకు సంబంధించి ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్కేఎన్.. వేణు స్వామి గురించి వ్యంగ్యంగా మాట్లాడారు. వేణు స్వామి వీడియోలు చాలా ఫన్నీగా ఉంటాయని.. ఆయన కామెడీని తాను చాలా ఆస్వాదిస్తానని అన్నాడు ఎస్కేఎన్. ఆయన ఇండియా ఓడిపోతుందంటే గెలుస్తుందని.. పవన్ కళ్యాణ్ ఓడిపోతాడంటే గెలిచారని.. ప్రభాస్ సినిమా ఫ్లాప్ అవుతుందంటే వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిందని.. ఇలా ఆయన చేసే కామెడీని తాను చాలా ఆస్వాదిస్తానని ఎస్కేఎన్ అన్నాడు.
ఐతే ఇలా కామెడీ జోస్యాలు చెబితే ఓకే కానీ.. సెలబ్రెటీల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లి.. శుభమా అని పెళ్లి చేసుకుంటుంటే విడిపోతారని వ్యాఖ్యానించడం ఎంత వరకు సమంజసమని ఎస్కేఎన్ ప్రశ్నించాడు. జ్యోతిష్యాన్ని తాను తప్పుబట్టనని.. కానీ దాంతో పాటు సంస్కారం ఉండాలంటూ వేణు స్వామి మీద విమర్శలు గుప్పించాడు ఎస్కేఎన్.
This post was last modified on August 21, 2024 7:34 am
మాళవిక మోహనన్.. చాలా ఏళ్ల నుంచి సోషల్ మీడియాలో ఈ పేరు ఒక సెన్సేషన్. బాలీవుడ్లో దిశా పటాని తరహాలో…
ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రానికి సంబంధించి సరికొత్త ప్రాజెక్టును ప్రకటించారు. దీనికి 'తెలుగు తల్లికి జల హారతి' అనే పేరును…
పుష్ప-2 సినిమా ప్రిమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన, అనంతర పరిణామాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
కొద్దిరోజుల క్రితం బేబీ జాన్ ప్రమోషన్లలో నిర్మాత అట్లీ మాట్లాడుతూ రన్బీర్ కపూర్ కి యానిమల్ ఎలా అయితే సూపర్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారిక పర్యటనలు, కార్యక్రమాల సందర్భంగా ఆయన అభిమానులు సినిమాల గురించి నినాదాలు చేయడం…
జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలయికలో తెరకెక్కుతున్న వార్ 2 షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తోంది. వచ్చే ఏడాది ఆగస్ట్…