బయట కంటే సోషల్ మీడియాలో ఎక్కువ నానుతూ హీరో రవితేజ కన్నా హరీష్ శంకరే ఎక్కువ హైలైట్ ఆయిన మిస్టర్ బచ్చన్ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది. పలు మార్గాల్లో ఇది యావరేజ్ కన్నా మెరుగ్గా ఆడుతోందని దర్శకుడు చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అవి ప్రేక్షకులకు రీచ్ కావడం లేదు. మీమర్స్ తో మీటింగ్ సైతం వీడియోల రూపంలో కాలక్షేపానికి పనికొచ్చింది తప్పించి కలెక్షన్లు పెంచడానికి ఉపయోగపడలేదు. ఇంకోవైపు నిర్మాణ సంస్థ పరిస్థితి అర్థమైపోయి మౌనంగా ఉంది. ప్రత్యేకంగా సక్సెస్ మీట్లు, సెలబ్రేషన్లు ఏవీ చేయకుండా ప్రాక్టికల్ గా ఆలోచిస్తోంది.
ట్రేడ్ టాక్ ప్రకారం మిస్టర్ బచ్చన్ ఇప్పటిదాకా రాబట్టింది కొంచెం అటుఇటుగా పదమూడు కోట్ల గ్రాసేనట. షేర్ గా చూసుకుంటే ఒక ఎనిమిది కోట్ల దాకా తేలుతుంది. బ్రేక్ ఈవెన్ చేరుకోవాలంటే ఇంకో ఇరవై కోట్లకు పైగానే షేర్ రాబట్టాలట. అధికారికంగా చెప్పలేదు కానీ ఇండస్ట్రీ వర్గాల్లో ఈ న్యూస్ అయితే ఉంది. ఎలా చూసుకున్నా ఇది సాధ్యమయ్యే పని కాదు. రెండో వారంలో పికప్ అవుతుందన్న సూచనలు తగ్గుతున్నాయి. పదమూడు నిముషాలు ట్రిమ్ చేసి వేగం పెంచినప్పటికీ అది జనాన్ని రప్పించేందుకు సరిపోవడం లేదు. ఇంకోవైపు ఆయ్, స్త్రీ 2 దూసుకుపోతున్నాయి.
అటు రవితేజ చూస్తే సితార సంస్థ భాను భోగవరపు దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమాలో బిజీ అయిపోయాడు. 2025 సంక్రాంతి విడుదల కాబట్టి వేగంగా పనులు జరుగుతున్నాయి. మిస్టర్ బచ్చన్ కొచ్చిన స్పందన తెలిసింది కనక ఎక్కువ దాని గురించి ఆలోచించే ఉద్దేశంలో లేడని సన్నిహితుల మాట. ఇంకోవైపు తమ కాంబోలో మరో సినిమా ఉంటుందని హరీష్ శంకర్ చెప్పాడు. ఒకవేళ నిజమైతే షాక్, మిరపకాయ్, మిస్టర్ బచ్చన్ తర్వాత నాలుగోది అవుతుంది. మూడింట్లో రెండు ఫ్లాప్ కావడం గమనించాల్సిన విషయం. ఇన్ని అంచనాల మధ్య బచ్చన్ నిరాశపరచడం ఎవరూ ఊహించనిది.
This post was last modified on August 20, 2024 2:37 pm
బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ తాండవం 2 మొదటి మూడు రోజులు మంచి వసూళ్లే రాబట్టినా,…
డిసెంబరు బాక్సాఫీస్కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…
‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదా. ఆ తర్వాత ఆమెకు మంచి మంచి…
అలియా భట్ ఎలా అన్ని బాధ్యతలను బ్యాలెన్స్ చేస్తుందో చూసి చాలామందికి ఆశ్చర్యమే. కొత్త ఇల్లు, సినిమాలు, బిజినెస్ పనులు,…
రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న మోహన్ లాల్ ప్యాన్ ఇండియా మూవీ వృషభ డిసెంబర్ 25 మళయాళంతో పాటు తెలుగులోనూ సమాంతరంగా…
శాండల్ వుడ్ హీరో ఉపేంద్ర ఎంత టిపికల్ గా ఆలోచిస్తారో తొంభై దశకంలో సినిమాలు చూసిన వాళ్లకు బాగా తెలుసు.…