Movie News

సినిమాగా యువరాజ్ సింగ్ జీవితం

క్రికెటర్ల బయోపిక్కులు కొత్తేమీ కాదు. ఎంఎస్ ధోని ఎంత పెద్ద హిట్టో అభిమానులను ఎప్పుడు అడిగినా గర్వంగా చెబుతారు. సచిన్ ఆ స్థాయిలో ఆడకపోయినా ఓటిటిలో భారీ స్పందన దక్కించుకుంది. డాక్యుమెంటరీ తరహాలో తీయడం వల్ల రిజల్ట్ మారింది కానీ లేదంటే రికార్డులు బద్దలయ్యేవి. అజారుద్దీన్ మీద తీశారు కానీ డిజాస్టరయ్యింది. భారీ ఫాలోయింగ్ లేకపోవడం ప్రభావం చూపించింది. మిథాలీ రాజ్ లైఫ్ ని స్క్రీన్ మీద చూపిస్తే జనం తిరస్కరించారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల స్టోరీలను తెరమీద చూపించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ కార్యరూపం దాల్చలేదు.

ఒకప్పటి యూత్ హాట్ ఫెవరెట్ యువరాజ్ సింగ్ జీవితాన్ని సినిమాగా తీయబోతోంది టి సిరీస్ నిర్మాణ సంస్థ. రవి భగ్చంద్కా భాగస్వామ్యంలో భారీ బడ్జెట్ తో రూపొందనుంది. ప్యాన్ ఇండియా లెవెల్ లో పెద్ద బడ్జెట్ కేటాయించబోతున్నారు. అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు కానీ టైటిల్ రోల్ ఎవరు చేస్తారనేది మాత్రం గుట్టుగా ఉంచారు. విక్కీ కౌశల్, సిద్దార్థ్ మల్హోత్రా, ఆదిత్య రాయ్ కపూర్ ఇలా పలువురు పేర్లు వినిపిస్తున్నాయి కానీ నేషనల్ వైడ్ ఇమేజ్ ఉన్న దక్షిణాది స్టార్ ని ప్రయత్నిస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. అతి త్వరలోనే సెట్స్ పైకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

క్రికెట్ ని సీరియస్ గా ప్రేమించే వాళ్లకు యువరాజ్ సింగ్ స్టామినా తెలుసు. 2007 ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ చివరి ఓవర్లో స్టువర్ట్ బ్రాడ్ బోలింగ్ ని ఊచకోత కోస్తూ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టి ముప్పై ఆరు పరుగులు రాబట్టడం చరిత్రలో నిలిచిపోయింది. అప్పటి షాట్లు నెలల తరబడి ఫ్యాన్స్ ని వెంటాడుతూ వచ్చాయి. ఎన్నో మైలురాళ్ళు సాధించిన యువరాజ్ క్యాన్సర్ బారిన పడి మృత్య ముఖం దగ్గరగా వెళ్లి పోరాడి బ్రతికాడు. దానికి సంబంధించిన ఎమోషనల్ ఎపిసోడ్స్ సినిమాలో ఉంటాయట. అంచనాలకు తగట్టు రూపొందిస్తే మాత్రం హిట్టు కొట్టొచ్చు. మన క్రీడా ప్రియులు ఎగబడి చూస్తారు.

This post was last modified on August 20, 2024 10:26 am

Share

Recent Posts

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

2 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

7 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

9 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

10 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

10 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

10 hours ago