ఇప్పటి తరం సినిమా ప్రేమికులకు పాత చిత్రాల మీద అంతగా అవగాహన ఆసక్తి ఉండవు. ఏదో టీవీలో వచ్చినపుడు చూసి పక్కకెళ్లిపోవడం తప్ప వాటి గురించి లోతుగా తెలుసుకునే ఆలోచన చేయరు. కానీ రీ రిలీజ్ పుణ్యమాని వింటేజ్ టాలీవుడ్ ని చూసే భాగ్యం ఫైవ్ జి జనరేషన్ యువతకు దొరుకుతోంది. తాము పుట్టకముందు వచ్చిన బ్లాక్ బస్టర్స్ ని బిగ్ స్క్రీన్ మీద విపరీతమైన అభిమానుల సందడి మధ్య చూస్తుంటే కొత్త అనుభూతికి గురవుతున్నారు. పోకిరి లాంటి మాస్ బొమ్మ నుంచి మురారి లాంటి ఎమోషనల్ డ్రామా దాకా దేనికి చూసినా అదే స్పందన. ఇక అసలు విషయానికి వద్దాం.
ఈ నెల నాలుగు కీలక రీ రిలీజులున్నాయి. మూడింటిలో సోనాలి బెంద్రేనే హీరోయిన్ కావడం అసలు ట్విస్ట్. మురారికొచ్చిన స్పందన చూశాం. ఆమె స్వయంగా ఒక వీడియో బైట్ చేసి మరీ పంపించింది. మహేష్ బాబు జోడిగా వసు పాత్రలో ఆమె గ్లామర్, అమాయకత్వం మరోసారి దర్శనమిచ్చింది. నెక్స్ట్ ఆగస్ట్ 22 ఇంద్ర వస్తోంది. గవర్నర్ చెన్నకేశవరెడ్డి కూతురిగా శంకర్ నారాయణను ప్రేమించే క్యారెక్టర్ లో మంచి మాస్ టచ్ తో కనిపిస్తుంది. అదే రోజు శంకర్ దాదా ఎంబిబిఎస్ ను విడుదల చేస్తున్నారు. దీంట్లో డాక్టర్ సునీతగా మంచి హ్యూమర్ తో పాటు ఎమోషన్స్ తో మెప్పిస్తుంది.
ఇప్పుడు సోనాలికి ప్రత్యేకంగా ఫ్యాన్స్ అంటూ ఎవరూ కొత్తగా లేరు కానీ ఒకప్పుడు అభిమానించిన వాళ్ళకు ఇది ట్రిపుల్ ట్రీట్. ఇంద్ర కోసం స్పెషల్ బైట్స్, ఇంటర్వ్యూలు సిద్ధమవుతున్నాయట. అందులో సోనాలిని మరోసారి కలవొచ్చు. ఓసారి క్యానర్ బారిన పడి అనారోగ్యం పాలైన ఈ సీనియర్ హీరోయిన్ దాన్నుంచి బయటపడేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. గత ఏడాది మన్మథుడు రీ రిలీజ్ సైతం సోనాలికి ఒక తీపి జ్ఞాపకంగా మిగిలింది. ఒకటి రెండు ఫ్లాపులు ఉన్నప్పటికీ ఆమెకు టాలీవుడ్ లో మటుకు అత్యధిక సక్సెస్ రేట్ ఉంది. దాన్నే రెండు దశాబ్దాల తర్వాత సెలెబ్రేట్ చేసుకుంటోంది.
This post was last modified on August 20, 2024 9:34 am
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…