ఏదో ఒక భాషకు పరిమితం కాకుండా.. వేరే భాషల్లోనూ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించాలని ప్రతి స్టార్ హీరోకూ ఉంటుంది. అందులోనూ గత దశాబ్ద కాలంలో చాలామంది హీరోలు పాన్ ఇండియా స్థాయిలో ప్రభావం చూపి మార్కెట్‌ను విస్తరించుకున్న నేపథ్యంలో తామూ ఆ బాటలో నడవాలని కోరుకుంటున్నారు.
ఇందులో భాగంగా కొన్ని సినిమాలను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. కానీ అందరికీ ఇది వర్కవుట్ కావడం లేదు. నేచురల్ స్టార్ నాని సైతం కొన్ని పాన్ ఇండియాప్రయత్నాలు చేశాడు. దసరా, హాయ్ నాన్న చిత్రాలు వేరే భాషల్లోనూ రిలీజయ్యాయి. అవి తెలుగులో బాగా ఆడినా.. వేరే భాషల్లో మాత్రం ప్రభావం చూపలేకపోయాయి. ఇతర భాషల్లో రిలీజ్ ఒక ప్రయాసగా మాత్రమే మిగిలింది.
ఐతే నానికి తమిళంలో ఫాలోయింగ్ లేకపోలేదు. అతను ఒక ‘సెగ’ అనే స్ట్రెయిట్ తమిళ సినిమా చేశాడు. ‘ఈగ’ సైతం తమిళంలో బాగా ఆడింది. కానీ అప్పుడొచ్చిన ఫాలోయింగ్‌ను సరిగా ఉపయోగించుకోలేదు.
ఐతే ఇప్పుడు నాని కొత్త చిత్రం ‘సరిపోదా శనివారం’ కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజవుతుండగా.. మిగతా భాషల సంగతేమో కానీ.. తమిళంలో మాత్రం ఇది బాగా ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రంలో విలన్‌గా నటించిన ఎస్.జె.సూర్యకు తమిళంలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఒక టైంలో ఎగ్జైటింగ్ క్యారెక్టర్లు చేసిన సూర్యకు ఈ మధ్య తమిళంలో కూడా మంచి పాత్రలు పడట్లేదు.
కానీ ‘సరిపోదా..’లో తన పాత్ర ఎగ్జైటింగ్‌గా కనిపిస్తోంది. ఇందులో కథానాయికగా చేసిన ప్రియాంక మోహన్ కూడా తమిళంలో పాపులర్. ఈ కథ కూడా సార్వజనీనమైందిగా అనిపిస్తూ తమిళ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. సినిమాను తమిళనాట బాగానే ప్రమోట్ చేస్తున్నారు. సినిమాకు మంచి టాక్ వస్తే.. తమిళంలోనూ నానికి మంచి హిట్ పడేలా కనిపిస్తోంది.
This post was last modified on August 20, 2024 10:10 am
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…