సినిమా కోసం ఏమైనా చేయడానికి సిద్ధమయ్యే నటుల్లో విక్రమ్ ఒకరు. నటనను అతను తీసుకున్నంత సీరియస్‌గా ఎవరూ తీసుకోలేరనిపిస్తుంది. పాత్ర కోసం ప్రాణం పెట్టి పని చేయడం అంటే ఏంటో విక్రమ్‌ను చూసే తెలుసుకోవాలి. ‘సేతు’ మొదలుకుని ‘ఐ’ వరకు తన పాత్రల కోసం విక్రమ్ ఎలా ఒళ్లు హూనం చేసుకున్నాడో అందరికీ తెలుసు. ఇదేం డెడికేషన్‌రా బాబూ అని ప్రతి సందర్భంలోనూ ప్రేక్షకులు ఆశ్చర్యపోతుంటారు.
ఐతే అంత కష్టపడే నటుడికి అందుకు తగ్గ విజయాలు దక్కకపోవడం బాధ కలిస్తుంది. ఒక సమయంలో శివపుత్రుడు, సామి, అపరిచితుడు లాంటి బ్లాక్‌బస్టర్లు అందుకున్న విక్రమ్.. ఆ తర్వాత సరైన విజయం లేక చాలా ఏళ్లు ఇబ్బంది పడ్డాడు. గత రెండు దశాబ్దాల్లో విక్రమ్‌కు నిఖార్సయిన సూపర్ హిట్ పడనే లేదు. ఇలాంటి టైంలో ‘తంగలాన్’ మూవీ మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు విక్రమ్.
ఈ సినిమాలో విక్రమ్ లుక్ చూసి షాకవ్వని వాళ్లు లేరు. పాత్ర కోసం అలాంటి మేకోవర్ అందరికీ సాధ్యం కాదు. ఆ లుక్‌లోనే సుదీర్ఘ కాలం షూటింగ్‌లో పాల్గొన్నాడు. విక్రమ్ అత్యంత కష్టపడ్డ చిత్రాల్లో ఇదొకటి. దీనికైనా మంచి ఫలితం దక్కుతుందా అని విక్రమ్ ఫ్యాన్స్ ఎదురు చూశారు. ఐతే తొలి రోజు ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది. దీంతో మరోసారి విక్రమ్ కష్టం బూడిదలో పోసిన పన్నీరవతుందా అన్న సందేహాలు కలిగాయి.
కానీ టాక్‌తో సంబంధం లేకుండా ఈ చిత్రానికి ఓపెనింగ్స్ వచ్చాయి. తర్వాతి రోజుల్లో కూడా సినిమా స్టడీగా సాగుతోంది. మూడు రోజుల్లో ఈ సినిమా వసూళ్లు రూ.56 కోట్లకు చేరుకున్నాయి. ఆదివారం అటు తమిళంలో, ఇటు తెలుగులో ఆక్యుపెన్సీలు బాగున్నాయి. వీకెండ్ వరకు సినిమా సంతృప్తికర వసూళ్లు రాబడుతోంది. వీక్ డేస్‌లో కూడా నిలబడగలిగితే విక్రమ్ ఖాతాలో చాన్నాళ్లకు ఒక మంచి హిట్ పడ్డట్లే. సినిమాలో లోపాలున్నప్పటికీ టీం పెట్టిన ఎఫర్ట్.. ముఖ్యంగా విక్రమ్ పడ్డ కష్టం చూసి.. అతడి నటన కోసం ప్రేక్షకులు థియేటర్లకు వెళ్తున్నారని చెప్పొచ్చు.
This post was last modified on August 19, 2024 6:25 pm
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…