యూత్ హీరో రాజ్ తరుణ్ ఆ మధ్య లావణ్య కేసులో బాగా నలిగిపోయిన టైంలో రెండు వారాల్లో రెండు సినిమాలతో థియేటర్ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. పురుషోత్తముడు, తిరగబడరా సామీ ఆశించిన ఫలితాలు అందుకోలేదు కానీ నా సామిరంగలో సపోర్టింగ్ రోల్ చేశాక తిరిగి సోలో హీరోగా కొనసాగుతున్నాడు. ఇప్పుడో భలే ఉన్నాడేతో మరోసారి ఆడియన్స్ ని పలకరించబోతున్నాడు. ప్రభాస్ తో ది రాజా సాబ్ తీయడంలో బిజీగా ఉన్న మారుతీ టీమ్ నుంచి వస్తున్న ప్రోడక్ట్ ఉంది. కేవలం రెండున్నర నెలల గ్యాప్ లో మూడు చిత్రాలతో వస్తున్న యూత్ హీరో రాజ్ తరుణ్ ఒక్కడే.
కథేంటో ఓపెన్ గా చెప్పేశారు. ఓ అబ్బాయి (రాజ్ తరుణ్) ని అందమైన ఓ అమ్మయి (మనీషా కందుకూర్) ఇష్టపడి ప్రేమిస్తుంది. లేడీస్ అంటేనే ఆమడదూరంలో పారిపోయే ఇతన్ని ఒప్పించడం పెద్ద సవాల్ గా మారుతుంది. అయినా సరే పెళ్లికి సిద్ధపడిన టైంలో అతని ప్రవర్తన విచిత్రంగా అనిపించి మగాడు కాదనే అనుమానం అందరిలో తలెత్తుతుంది. దీంతో ఇంటా బయటా తలెత్తుకోలేని పరిస్థితి. అప్పుడే ఒక బాబా సలహా (శ్రీకాంత్ అయ్యంగార్) సలహా విని కొత్త పథకం ఇస్తాడు. అయితే కుర్రాడి వెనుక అసలు ఫ్లాష్ బ్యాక్ వేరే ఉంటుంది. అదేంటనేది తెలుసుకోవడమే అసలు స్టోరీ.
దర్శకుడు శివసాయి వర్ధన్ డిఫరెంట్ పాయింట్ తీసుకున్న వైనం కనిపిస్తోంది. ఆ మధ్య సంతోష్ శోభన్ ఏక్ మినీ కథ తరహాలో సెన్సిబుల్ థీమ్ కి హాస్యం జోడించి సందేశం ఇచ్చేలా ప్లాన్ చేసినట్టున్నారు. రాజ్ తరుణ్ కొత్త తరహా మ్యానరిజంస్ తో బాగున్నాడు. మారుతీ బ్రాండ్ కాబట్టి ఖచ్చితంగా వినోదానికి ఢోకా లేకుండా ఉంటుంది కానీ ఇప్పుడున్న రాజ్ తరుణ్ మార్కెట్ పరిస్థితుల్లో దీన్ని ప్రమోట్ చేసుకోవడం చాలా కీలకం. శేఖర్ చంద్ర సంగీతం సమకూరుస్తున్న ఈ ఎంటర్ టైనర్ సెప్టెంబర్ 6 విడుదల కానుంది. రాజ్ తరుణ్ కి రిలీఫ్ ఇచ్చేలా ఇది హిట్టవ్వాలని ఫ్యాన్స్ కోరిక.
This post was last modified on August 19, 2024 6:20 pm
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…