ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లతో ఆల్ టైం బ్లాక్ బస్టర్ గా నిలిచిన కల్కి 2898 ఏడిలో ప్రభాస్ పాత్ర గురించి బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి చేసిన కామెంట్లు పెద్ద దుమారమే రేపాయి. తక్షణమే అతను క్షమాపణ చెప్పాలంటూ డార్లింగ్ ఫ్యాన్స్ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒక సినిమా నచ్చడం, నచ్చకపోవడం వ్యక్తిగత అభిప్రాయమే కావొచ్చు కానీ ఇలా ఒక యాక్టర్ ని అదే పనిగా టార్గెట్ చేసుకోవడం పట్ల భగ్గుమంటున్నారు. టి సిరీస్ లాంటి అతి పెద్ద బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ ప్రభాస్ వెంటపడి మరీ వరసగా చిత్రాలు నిర్మించడాన్ని ఉదాహరణగా చూపిస్తున్నారు.
మున్నాభాయ్ ఎంబిబిఎస్ ఏటిఎం పాత్ర ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న అర్షద్ వార్సికి ఆ తర్వాత జాలీ ఎల్ఎల్బి మరింత పేరు తీసుకొచ్చింది. అసుర్ వెబ్ సిరీస్ కు మంచి స్పందన వచ్చింది. దీంతో తనకు తాను పెద్ద స్టార్ గా భావిస్తున్నాడో ఏమో మరి ఏకంగా ప్రభాస్ ని జోకర్ అనే స్థాయికి దిగజారిపోయాడు. అవసరం లేకపోయినా మ్యాడ్ మ్యాక్స్, మెల్ గిబ్సన్ లతో పోలిక తేవడంతో పాటు అమితాబ్ బచ్చన్ ని పొగడటం కోసం ప్రభాస్ ని తక్కువ చేసే మాట్లాడే మేధావితనం ఎందుకు వచ్చిందో మరి. ముంబై మీడియా సైతం ఇతని వ్యాఖ్యలను ఖండిస్తూ కథనాలు వెలువరిస్తున్నాయి.
ఏది ఏమైనా ప్రభాస్ మీద ఈ ఏడుపు ఇప్పటిది కాదు. బాహుబలి నుంచే మొదలయ్యింది. హిందీలో రికార్డులు సృష్టించినప్పుడు చాలా మంది బడా హీరోలు కనీసం దాన్ని చూసేందుకు, విజయాన్ని అంగీకరించేందుకు ఇష్టపడలేదు. ఆర్ఆర్ఆర్ టైంలో అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ ప్రమోషన్లలో పాల్గొనడానికి కారణం రాజమౌళితో అవసరం, చరణ్ తో స్నేహం లాంటి కారణాలున్నాయి. అంతే తప్ప స్వచ్ఛందంగా ముందుకొచ్చి సౌత్ సినిమాని మోసిన దాఖలాలు చాలా తక్కువ. సపోర్టింగ్ రోల్స్ చేసుకునే ఒక ఆర్టిస్టు వెయ్యి కోట్ల మార్కెట్ ఉన్న స్టార్ మీద మాట తూలాడంటే అది వైరల్ కావడం కోసమే.
This post was last modified on August 19, 2024 3:01 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…