బిరుదుకు తగ్గట్టు మంచి ఎనర్జీతో తొణికిసలాడే రామ్ కు హ్యాట్రిక్ డిజాస్టర్ జరిగిపోవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ది వారియర్, స్కంద, డబుల్ ఇస్మార్ట్ ఇలా వరుసగా మూడు ఫ్లాపులు పడటం ఏ హీరోకైనా బాధ కలిగించే విషయమే. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది.
రామ్ ఊర మాస్ కోరుకుంటున్నాడు. ఇస్మార్ట్ శంకర్ తీసుకొచ్చిన ఇమేజ్ ని ఎలాగైనా పెంచుకుని టయర్ 1లోకి వెళ్లిపోవాలనే తాపత్రయం విపరీతంగా పెరిగిపోయింది. దాంతో దర్శకులు తనను ఎలా చూపించాలనుకుంటున్నారనే దాని గురించి లోతైన విశ్లేషణ చేసుకోవడం లేదు. అదే నష్టం చేకూరుస్తోంది.
గతంలోనూ రామ్ హైపర్ లాంటి పొరపాట్లు చేశాడు. స్వంత బ్యానర్ లో శివమ్ దారుణంగా పోయింది. కానీ కూల్ అండ్ లవర్ బాయ్ గా చేసినవి మాత్రం మంచి ఫలితాలు ఇచ్చాయి. నేను శైలజ ఇప్పటికీ యూత్ ఫెవరెట్స్ లో ఒకటి. ఉన్నది ఒకటే జిందగీ గొప్పగా ఆడకపోయినా డీసెంట్ మూవీగా పేరు తెచ్చుకుంది. కామెడీ ఎంటర్ టైనర్ అంటే గుర్తొచ్చేది రెడీనే. హలో గురు ప్రేమ కోసమే కూడా మంచి కలెక్షన్లు రాబట్టింది. జగడంతో వయొలెన్స్ ట్రై చేస్తే సుకుమార్ హిట్టివ్వలేకపోయాడు. ఒక్క ఇస్మార్ట్ శంకర్ మాత్రమే మాస్ కి నచ్చి సక్సెసయ్యింది. దానికి కారణాలు సవాలక్ష.
వీలైనంత త్వరగా రామ్ మాస్ హ్యాంగోవర్ నుంచి బయటికి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కంటెంట్ ఉంటే ఆయ్, కమిటీ కుర్రోళ్ళు లాంటి చిన్న సినిమాలే బ్రహ్మాండంగా ఆడగా లేనిది ఇంత ఇమేజ్, మార్కెట్ పెట్టుకుని పదే పదే ఒకే ఛట్రంలో ఇరుక్కుపోవడం ఎందుకనేది వాళ్ళ వెర్షన్. నిజమే కదా. అసలే నెక్స్ట్ హరీష్ శంకర్ తో చేస్తున్నాడు. మిస్టర్ బచ్చన్ ఫలితం చూశాక ఇప్పుడీ కాంబోకొచ్చే హైప్ మీద అనుమానాలు తలెత్తుతాయి. వీలైనంత త్వరగా రామ్ తనను తాను ఎక్కడ బాలన్స్ తప్పుతున్నాడో సెల్ఫ్ రివ్యూ చేసుకుంటే తప్ప ఈ అపజయాల పరంపరకు అడ్డుకట్ట పడదు.
This post was last modified on August 18, 2024 10:42 am
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…