ఆగస్ట్ 22 చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల కాబోతున్న ఇంద్రకు మంచి ఛాన్స్ దొరికేసింది. ఇండిపెండెన్స్ డే కొత్త రిలీజులు ఎక్కువ ఉండటంతో దీనికి సరిపడా థియేటర్లు దొరుకుతాయో లేదోననే టెన్షన్ మెగాభిమానుల్లో ఉండేది. దానికి తగ్గట్టు వైజయంతి మూవీస్ మొన్నటి దాకా ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో అనుమానాలు మరింత పెరిగాయి. తర్వాత ఏపీ తెలంగాణ థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను ఏషియన్ సురేష్ సంస్థలకు ఇవ్వడంతో ఒక్కసారిగా మబ్బులు వీడిపోయాయి. భారీ ఎత్తున రీ రిలీజ్ కు చకచకా ఏర్పాట్లు జరిగిపోయాయి. ఆన్ లైన్ టికెట్లు బుక్ మై షోలో పెట్టేశారు.
మెల్లగా మొదలైనా క్రమంగా ఊపందుకుంది. ఇరవై గంటల వ్యవధిలో 12 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయిన ఇంద్ర ఒక్క హైదరాబాద్ నుంచే సగటున 40 లక్షల దాకా గ్రాస్ దాటేసినట్టు ట్రేడ్ రిపోర్ట్. ఉదయం ఏడు నుంచి ఎనిమది మధ్య ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో వేస్తున్న నాలుగైదు షోలకు ఒక్క టికెట్ అందుబాటులో లేదు. ఇతర నగరాల్లోనూ స్పెషల్ షోలు డిమాండ్ కు అనుగుణంగా పెంచుకుంటూ పోతున్నారు. గురువారం కావడంతో లాంగ్ వీకెండ్ కలిసి వస్తుందని ఫ్యాన్స్ నమ్మకం. చిరంజీవి కెరీర్ లోనే ఆల్ టైం బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఇంద్ర రెండు దశాబ్దాలకు పైగా బిగ్ స్క్రీన్ మీద రాలేదు.
ఎలాగూ సరైన మాస్ బొమ్మ బాక్సాఫీస్ వద్ద లేదు కాబట్టి ఇంద్రకు ఇది లక్కీ ఛాన్స్. రీ రిలీజ్ ట్రెండ్ అయిపోయిందనుకుంటున్న తరుణంలో మురారి ఒక్కసారిగా దానికి ఊపు తెచ్చింది. సెంటిమెంట్ మూవీకే అంత ఆదరణ దక్కినప్పుడు ఇక ఇంద్రకు ఏ స్థాయిలో స్పందన ఉంటుందో చెప్పాలా. పైగా ఎప్పటి నుంచో డిమాండ్ లో ఉన్న సినిమా. బి గోపాల్ దర్శకత్వం వహించిన ఈ ఫ్యాక్షన్ ఎంటర్ టైనర్ కు మణిశర్మ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై స్థాయికి తీసుకెళ్లాయి. చిరు బర్త్ డే కావడంతో ఇంద్రతో పాటు విశ్వంభర టీజర్ ని జోడించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే డబుల్ బొనాంజా ఖాయమే.
This post was last modified on August 18, 2024 10:38 am
స్విట్జర్లాండ్ నగరం దావోస్ గడచిన 4 రోజులుగా భారీ జన సందోహంతో కిటకిటలాడుతోంది. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్…
ఏపీ నూతన రాజధాని అమరావతికి నూతనోత్తేజం వచ్చేసింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేజిక్కించుకోవడంతోనే అమరావతికి…
అసలే అది ఇన్వెస్టర్ల సమావేశం. పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆయా దేశాలు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఇన్వెస్టర్లను ప్రసన్నం చేసుకునేందుకు…
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…