ఇండస్ట్రీ పోకడల గురించి అగ్ర నిర్మాతలు నిజాలు మాట్లాడ్డం అరుదు. అయితే దిల్ రాజు చాలాసార్లు దానికి మినహాయింపు ఇస్తుంటారు. నిన్న జరిగిన రేవు అనే చిన్న సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మరోసారి ఇది బయట పడింది. తన ప్రసంగంలో ట్రెండ్ గురించి మాట్లాడుతూ ప్రేక్షకులను థియేటర్లకు రాకుండా మేమే చెడగొట్టామని, నాలుగు వారాలకే ఓటిటిలో తెస్తాం, మీరు ఇంట్లోనే ఉండండని చెప్పడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పుకొచ్చారు. కంటెంట్ బాగుంటే బలగం, కమిటీ కుర్రోళ్ళు లాగా నెమ్మదిగా అయినా జనం వస్తారని ఆ విజయాలను ఉదాహరణగా చూపారు.
సరైన సందర్భంలో దిల్ రాజు సరైన మాటే అన్నారు. ఎందుకంటే మరీ నెల రోజులకే డిజిటల్ స్ట్రీమింగ్ వల్ల వసూళ్లు ప్రభావితం చెందుతున్న మాట వాస్తవం. సలార్, గుంటూరు కారం, టిల్లు స్క్వేర్, ది ఫ్యామిలీ స్టార్ లాంటి స్టార్ హీరోల చిత్రాలన్నీ త్వరగా ఓటిటిలో వచ్చేయడం చూశాం. హనుమాన్, కల్కి 2898 ఏడి ఆలస్యం చేయడం వాటికి చాలా ప్లస్ అయ్యింది. థియేటర్ రెవిన్యూ బాగా రావాలని కోరుకున్నప్పుడు ఖచ్చితంగా గ్యాప్ పెద్దది ఉండాలి. లేదూ డిజిటల్ కంపెనీలు ఎక్కువ రేట్ ఇస్తున్నాయని ఆశపడితే బంగారు బాతును కోసుకుని తిన్న అమాయకుడి కథ గుర్తొస్తుంది.
క్రమంగా కొన్ని కఠిన పద్ధతులు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బాలీవుడ్ లో చిన్నా పెద్దా తేడా లేకుండా ఏ సినిమా యాభై రోజులు దాటకుండా ఓటిటికి రాదు. ఒకవేళ ఆలా చేసే పక్షంలో తమ స్క్రీన్లను ఇవ్వమని మల్టీప్లెక్సులు అల్టిమేటం ఇచ్చాయి. దానికి అనుగుణంగానే నిర్మాతలు దాన్ని పాటిస్తున్నారు. మలయాళంలోనూ ఇటీవలే ఇలాంటి చర్యలకు శ్రీకారం చుట్టారు. తమిళనాడులో నిర్మాతల సమాఖ్య కొన్ని వారాల క్రితమే ఆంక్షలతో కూడిన మార్గదర్శకాలు విడుదల చేశారు. సో ఇక మిగిలింది మన వైపు మాత్రమే. దిల్ రాజు గారే అన్నారు కాబట్టి ఆ దిశగా మార్పు వస్తుందేమో చూడాలి.
This post was last modified on August 17, 2024 9:51 am
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…