జాతీయ ఉత్తమ చిత్రంగా మళయాళ మూవీ ఆట్టం అవార్డు గెలుచుకున్నాక ఒక్కసారిగా అందరి దృష్టి దాని వైపుకి వెళ్తోంది. రెగ్యులర్ గా మల్లువుడ్ సినిమాలను ఫాలో అయ్యేవాళ్ళకు ఇది తెలుసు కానీ ఏదో స్టార్ హీరో రీమేక్ చేస్తే తప్ప వాటిని పట్టించుకోని వాళ్లకు మాత్రం ఇది కొత్తే. కమర్షియల్ ఫార్ములాకు దూరంగా ప్రయోగాలు చేస్తూ ఇటు క్రిటికల్ గా అటు కమర్షియల్ గా రెండు రకాలుగా విజయాలు సాధిస్తున్న అక్కడి దర్శకులు ఈ మధ్య మనోళ్లను కూడా బాగా ఆకట్టుకుంటున్నారు. గాడ్ ఫాదర్, భీమ్లా నాయక్, బుట్టబొమ్మ, కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్ వగైరాలన్నీ కేరళ నుంచి వచ్చినవే.
అసలు అంతగా ఆట్టంలో ఏముందో చూద్దాం. ఇదో సస్పెన్స్ డ్రామా. 12 మంది నాటక బృందంలో అంజలి అని ఒకే అమ్మాయి ఉంటుంది. వీళ్ళ టాలెంట్ మెచ్చుకున్న ఫారినర్స్ జంట ఒకటి రిసార్ట్ లో పార్టీ ఇస్తుంది. పీకలదాకా బాగా మందు కొట్టేసి శుభ్రంగా పడుకుంటారు. ఘాడ నిద్రలో ఉండగా వాళ్ళలో ఒకడు అంజలి పడుకున్న గది కిటికీలో నుంచి అసభ్యంగా ప్రవర్తించి చీకట్లో పారిపోతాడు. వాడెవడో కనిపెట్టే క్రమంలో మనుషుల మధ్య మారిపోయే మనస్తత్వాలను దర్శకుడు ఆనంద్ ఏకర్షి అద్భుతంగా చూపిస్తాడు. దొంగ ఎవరో గెస్ చేయలేనంత గ్రిప్పింగ్ గా స్క్రీన్ ప్లే ఉంటుంది.
ఎలాంటి బోల్డ్ కంటెంట్, బూతు డైలాగులు లేకుండా ఇలాంటి డ్రామాని నడిపించడం కత్తి మీద సాము లాంటిది. దాన్ని సమర్ధవంతంగా చేసి చూపించారు. ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ పోటీ పడుతూ సాగుతుంది. అయితే ఇది మన ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే సెటప్ కాదు. అందుకే ఎవరూ రీమేక్ ప్రయత్నాలు చేయలేదు. ఒకవేళ ఇప్పుడేమైనా ట్రై చేస్తారేమో చూడాలి. ప్రైమ్ లో తెలుగు సబ్ టైటిల్స్ తో పాటుగా అందుబాటులో ఉంది కాబట్టి ఒక లుక్ వేయొచ్చు. 1954లో వచ్చిన 12 యాంగ్రీ మ్యాన్ ని స్ఫూర్తిగా తీసుకుని ఈ ఆట్టంని రూపొందించడం కొసమెరుపు. చాలా ఫిలిం ఫెస్టివల్స్ లో స్క్రీన్ చేశారు.
This post was last modified on August 16, 2024 4:55 pm
గత ఏడాది డిసెంబర్ అన్నారు. తర్వాత ఏప్రిల్ అనౌన్స్ చేశారు. ఇప్పుడు దసరా లేదా దీపావళికి రావడం అనుమానమే అంటున్నారు.…
https://youtu.be/2y_DH5gIrCU?si=-Esq17S1eaW7D4yg ఒక టీజర్ కోసం స్టార్ హీరో అభిమానులు ఎదురు చూడటం మాములే కానీ పెద్ది విషయంలో మాత్రం ఇది…
లైగర్, డబుల్ ఇస్మార్ట్ చిత్రాలతో డబుల్ షాక్ తిన్నాడు సీనియర్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈ దెబ్బతో ఆయనకు సినిమా…
వక్ఫ్ సవరణ బిల్లు చట్టంగా మారిపోయింది. ఈ మేరకు వక్ఫ్ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం రాత్రి…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు ఇప్పటికే ఆర్థిక…
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సొంత నియోజకవర్గం.. పిఠాపురంలో ఏం జరుగుతోంది? పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న…