ఎన్నో వారాల తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడబోతోంది. జూన్ నెల నుంచి సరైన సినిమాలు లేక అధిక శాతం థియేటర్ల కనీస నిర్వహణ ఖర్చులు రాక ఆకలితో ఉన్న బయ్యర్లకు, ప్రేక్షకులకు విందు భోజనం వడ్డించేందుకు ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగు చిత్రాలు ఆగస్ట్ 15 రానుండటంతో అందరి కళ్ళు వాటి మీదే ఉన్నాయి. ‘మిస్టర్ బచ్చన్’ సందడి ముందు రోజు సాయంత్రమే ప్రీమియర్ల రూపంలో మొదలవుతోంది. రవితేజ మూవీకి ఇలా స్పెషల్ షోలు వేయడం అరుదు కావడంతో టికెట్ల అమ్మకాలు హాట్ కేకుల్లా మారిపోయాయి. దాదాపు అన్ని షోలు సోల్డ్ అవుట్ బోర్డులు పడుతున్నాయి.
ఇక ‘డబుల్ ఇస్మార్ట్’ బుకింగ్స్ విషయంలో కొంత ఆలస్యం జరిగినప్పటికీ ట్రెండింగ్ లోకి రావడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. రామ్, పూరి జగన్నాధ్ కలయిక మరో మాస్ హిస్టీరియా ఖాయమనే నమ్మకంతో ఫ్యాన్స్ బోలెడు ఆశలు పెట్టుకున్నారు. సంజయ్ దత్ విలనీ, మణిశర్మ సంగీతం అంచనాలు పెంచుతున్నాయి. చిన్న చిత్రమే అయినా ‘ఆయ్’ని బన్నీ వాస్, అల్లు అరవింద్ చాలా ప్రత్యేకంగా ప్రమోట్ చేస్తున్నారు. నిఖిల్, శ్రీలీలతో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. నితిన్ నార్నె హీరోగా రూపొందిన ఈ విలేజ్ ఎంటర్ టైనర్ రేపు సాయంత్రం నాలుగు గంటల నుంచి షోలు మొదలుపెట్టనుంది.
ఇవి కాకుండా తమిళ డబ్బింగ్ ‘తంగలాన్’ మీద తెలుగులో ఓ మోస్తరు అంచనాలున్నాయి. విక్రమ్ ఇమేజ్ తో పాటు షాకింగ్ అనిపించే విభిన్నమైన వాతావరణంలో దర్శకుడు పా రంజిత్ తీసిన తీరు ఆసక్తి రేపుతోంది. టాక్ బాగా వస్తే పైన మూడింటిని తట్టుకుని నిలబడగలదు కానీ యావరేజ్ అనే మాట వచ్చినా ఇబ్బందే. ఇవి కాకుండా బాలీవుడ్ నుంచి స్త్రీ 2, ఖేల్ ఖేల్ మే, వేదాలు వస్తున్నా హైదరాబాద్ లాంటి నగరాలు మినహాయించి మిగిలిన చోట వాటికి బజ్ తక్కువే. జనవరి తర్వాత ఆ స్థాయి సందడి మళ్ళీ ఇప్పుడే కనిపిస్తోంది. ఇవి రెండు వారాలు నిలబడితే నెలాఖరులో సరిపోదా శనివారంతో జోష్ కొనసాగుతుంది
This post was last modified on August 14, 2024 12:29 pm
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…