తమిళ ఫిలిం ఇండస్ట్రీలో చాలా కష్టపడి స్టార్ హీరోగా ఎదిగిన నటుల్లో శివ కార్తికేయన్ ఒకడు. ఒకప్పుడు అతను విజయ్ టీవీలో వీడియో జాకీగా పని చేయడం విశేషం. అలాంటి నేపథ్యం నుంచి వచ్చి.. ముందు సహాయ పాత్రలు చేసి.. ఆపై హీరో అయ్యాడు. ఇప్పుడు కోలీవుడ్లో మిడ్ రేంజ్ స్టార్లలో అతనొకడు. ఐతే కెరీర్ తొలి నాళ్లలో శివకు మంచి సపోర్ట్ ఇచ్చి తనను ఒక స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తిగా ధనుష్‌కు పేరుంది. థనుష్ తన సినిమాల్లో అతడికి సహాయ పాత్రలు ఇచ్చి ప్రోత్సహించడమే కాదు.. శివ హీరోగా ఎదిర్ నీచ్చిల్ అనే సినిమాను ప్రొడ్యూస్ చేశాడు కూడా.
ఐతే కొన్నేళ్ల పాటు ధనుష్, శివ మధ్య మంచి స్నేహం ఉండేది. కానీ ఈ మధ్య వారి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి దూరం అయ్యారనే ప్రచారం నడుస్తోంది. అంతే కాక శివ.. దనుష్ పట్ల కృతజ్ఞతను చూపించట్లేదని ఫ్యాన్స్ ఆరోపిస్తుంటారు. ఈ ఏడాది సంక్రాంతికి ధనుష్ సినిమా కెప్టెన్ మిల్లర్ మీద శివ మూవీ అయలాన్ పైచేయి సాధించినపుడు అభిమానుల మధ్య పెద్ద గొడవే జరిగింది.
ఇక వర్తమానంలోకి వస్తే.. నిర్మాత కూడా అయిన శివకార్తికేయన్ తాజాగా కొట్టుక్కాలి అనే సినిమాను ప్రొడ్యూస్ చేశాడు. ఈ సినిమాకు సంబంధించిన ఒక ప్రమోషనల్ ఈవెంట్లో శివ మాట్లాడుతూ.. తాను ఈ సినిమాతో ఎవరికీ జీవితం ఇవ్వట్లేదని వ్యాఖ్యానించాడు. ఇలా సినిమా తీయడం ద్వారా జీవితాల్ని నిలబెట్టేశామని అనుకోకూడదని.. గతంలో కొందరు ఇలాగే తన గురించి మాట్లాడి తనను ఇబ్బంది పెట్టారని శివ కార్తికేయన్ అన్నాడు. తాను మాత్రం అలా మాట్లాడనని పేర్కొన్నాడు.
ఐతే శివకార్తికేయన్ ఎవరి పేరూ ఎత్తకపోయినా.. ధనుష్‌ను ఉద్దేశించే అతను ఈ కౌంటర్ వేశాడనే ప్రచారం మొదలైంది. సోషల్ మీడియాలో ధనుష్ ఫ్యాన్స్.. శివ మీద విరుచుకుపడుతున్నారు. తనకు అంత సపోర్ట్ చేసి కెరీర్ ఇస్తే శివ కనీసం కృతజ్ఞత చూపించకపోయినా పర్వాలేదు కానీ.. ఇలా ఇన్ డైరెక్ట్ కౌంటర్లు వేయడం ఏం పద్ధతి అని అతణ్ని తిట్టిపోస్తున్నారు. ఐతే శివ ఫ్యాన్స్ మాత్రం శివ ఎవరిని ఉద్దేశించి ఈ మాట అన్నాడో తెలియకుండా తననెలా తప్పుబడతారని ప్రశ్నిస్తున్నారు.
This post was last modified on August 14, 2024 10:41 am
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…