నిన్న విడుదలైన కంగువ ట్రైలర్ అభిమానుల అంచనాలు అందుకుంది కానీ మూవీ లవర్స్ నుంచి ఎక్స్ ట్రాడినరి అనిపించుకోవడంలో కొంచెం తడబడిన మాట వాస్తవం. దీనికి కారణం లేకపోలేదు. దర్శకుడు శివ చాలా జాగ్రత్తగా స్టోరీ ఎక్కడ రివీల్ కాకుండా ఇది కేవలం అడవి తెగల మధ్య పోరాటంగా చూపించే ప్రయత్నం చేయడమే. కానీ ఇన్ సైడ్ టాక్ ప్రకారం బయటకి చెప్పని కథ చాలా ఉందట. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ స్ఫూర్తిగా కొన్ని అంశాలు, డీటెయిల్స్ శివ రాసుకున్న తీరు, తెరకెక్కించిన విధానం షాక్ ఇచ్చేలా ఉంటాయట. అవేంటో ఒక లుక్ వేద్దాం.
కంగువ (సూర్య) నాయకత్వం వహించే అటవీ తెగని మంటల బ్యాక్ డ్రాప్ లో, నిప్పుని హైలైట్ చేస్తూ చూపించారు. ఈ బృందానికి మాస్కులు ఉన్నాయి కానీ నెత్తిన టోపీలు లేవు. శత్రువు బాబీ డియోల్ జాతి రక్తానికి ప్రతినిధి. వాళ్ళ కిరీటాలు కొమ్ములున్నాయి. స్పార్టన్స్ ని స్ఫూర్తి పొందినట్టుగా విజువల్స్ కనిపిస్తున్నాయి. నాణేలపైన రాజు యొక్క బొమ్మలు ముద్రించే సంప్రదాయం వీళ్ళకే ఉంటుంది. స్పార్టన్ల శిక్షలు దారుణంగా ఉంటాయి. మనుషుల చేతులను నరికి సముద్రంలో పారేసి వాటి ద్వారా డబ్బులు సంపాదించుకుంటారు. బాబీ డియోల్ ముందు సూర్య జాతిలోనే ఉంటాడు.
సూర్య ఒక్క షాట్ లో తప్ప ఎక్కడా కత్తిని ఉపయోగించడు. పదునైన గొడ్డలి లాంటి ఆయుధంతోనే కనిపిస్తాడు. చివరిలో కనిపించే బ్లర్ చేసిన సీన్ లో ఉన్నది కూడా సూర్యనే కానీ కార్తీ కాదన్నది ఇన్ సైడ్ టాక్. బాబీ డియోల్ చేసిన ద్రోహం వల్ల సూర్య తెగ అంతరించి పోతే మళ్ళీ దాన్ని పునఃసృష్టించే బాధ్యత తీసుకుంటాడట. మొత్తానికి ఇదంతా నిజమో కాదో కానీ ట్రైలర్ ని బాగా డీ కోడ్ చేసి చూస్తే ఈ విషయాలన్నీ బయట పడుతున్నాయి. ఇదంతా ఒక ఎత్తయితే సూర్య ఆధునిక గెటప్ తో వర్తమానంలో కనిపించే ఎపిసోడ్ మరొకటి ఉంది. సో ఇప్పటిదాకా ట్రైలర్ లో చూసిందంతా కేవలం సాంపిల్ మాత్రమే.
This post was last modified on August 13, 2024 6:44 pm
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…