నిన్న సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ ఏవిఎం నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ల కోసం ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. మాములుగా అయితే ఇందులో విశేషం ఏమీ లేదు. కానీ దర్శకుడు నాగ అశ్విన్ పేరుని హైలైట్ చేసి మెయిల్ ఐడిలో ప్రాజెక్ట్ ఎస్ అని పేర్కొనడంతో ఒక్కసారిగా ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. కల్కి రెండో భాగం కోసం ఆశగా ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఎందుకంటే ప్రాజెక్ట్ ఎస్ అంటే ఖచ్చితంగా వేరే సినిమానే. కల్కి సీక్వెల్ అవకాశాన్ని వేరే బ్యానర్ కు ఇచ్చేందుకు వైజయంతి ఎంత మాత్రం సంసిద్ధంగా లేదు. కాకపోతే లేట్ అవ్వొచ్చు.
ఇక్కడ సలార్ ప్రస్తావన ఎందుకంటే ప్రశాంత్ నీల్ సైతం ఎంత డిమాండ్ ఉన్నా పార్ట్ 2 శౌర్యంగ పర్వం మొదలుపెట్టలేదు. సైలెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ ప్రాజెక్టుకి కమిటైపోయి 2026 జనవరి దాకా తనను తాను లాక్ చేసుకున్నాడు. సో కొంత కాలం సలార్ 2 గురించి మర్చిపోవడం ఉత్తమం. ఇప్పుడు నాగ్ అశ్విన్ కనక ప్రాజెక్ట్ ఎస్ లో బిజీ అయిపోతే కల్కి సైతం ఇదే తరహాలో భారీ ఎదురు చూపులను డిమాండ్ చేస్తుంది. ఇంకా స్క్రిప్ట్ రెడీ చేయాలి. ఆర్టిస్టుల డేట్లు తీసుకోవాలి. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే, దుల్కర్ సల్మాన్ తదితరులను లాక్ చేసుకోవాలి. ఇంకా చాలా పనుంది.
ప్రభాస్ కమిట్మెంట్లు చూస్తే ది రాజా సాబ్ కాగానే హను రాఘవపూడి సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. ఆగస్ట్ 15 లేదా 17 అనౌన్స్ మెంట్ ఉండొచ్చు. ఫౌజి టైటిల్ ప్రచారంలో ఉంది. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా కనక స్పిరిట్ ఫైనల్ వెర్షన్ రెడీ చేస్తే దాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లాలి. ఏడాదికి ఖచ్చితంగా రెండు సినిమాలు రిలీజ్ చేసే తీరాలని కంకణం కట్టుకున్న ప్రభాస్ దానికి అనుగుణంగానే ప్లాన్ చేసుకుంటున్నాడు. బాహుబలి లాగా ఒకే మూవీకి ఏళ్ళ తరబడి ఖర్చు పెట్టేందుకు ఇష్టపడటం లేదు. సో ఎలా చూసుకున్నా సలార్ 2, కల్కి 2 రావడం ఖాయమే కానీ బాగా టైం పట్టేలా ఉంది.
This post was last modified on August 13, 2024 10:43 am
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…