టాలీవుడ్లో ఎంతోమంది నెపో కిడ్స్ ఉన్నారు. ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో చాలామంది స్టార్లుగా ఎదిగారు. కొంతమంది మాత్రం ఈ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయారు. ఐతే స్రవంతి మూవీస్ అధినేత తమ్ముడి కొడుకైన రామ్ మాత్రం హీరోగా మంచి స్థాయిని అందుకున్నారు. హీరోల కొడుకులు స్టార్లు కావడం ఈజీనే కానీ.. ఇలా నిర్మాత తమ్ముడి తనయుడు స్టార్ స్టేటస్ సంపాదించడం అంత తేలికైన విషయం కాదు.
ఐతే తనకు 8 ఏళ్ల వయసుండగానే హీరో కావాలని డిసైడైపోయానని.. అప్పుడు తమ కుటుంబ సభ్యులు అన్న మాటకు హర్టయి బ్యాగ్రౌండ్‌ను వాడుకోకుండానే తాను సినిమాల్లోకి రావడానికి తన వంతు ప్రయత్నం చేసినట్లు తాజాగా ఒక ఇంటర్వ్యూలో రామ్ వెల్లడించాడు.. ఇంతకీ రామ్ హీరో కావడానికి ముందు ఏం జరిగిందంటే…
“నాకు ఎనిమిదేళ్ల వయసుండగా మా అమ్మతో నేను హీరో కావాలనుకుంటున్నట్లు చెప్పాను. ఐతే మా పెదనాన్న నిర్మాత కాబట్టి నేను ఆటోమేటిగ్గా హీరో అయిపోవాలనుకుంటున్నానని.. ఒక మోజుతో ఆ మాట అంటున్నానని మా కుటుంబ సభ్యులు అనుకున్నారు. వాళ్లు అదే మాట అనేసరికి నేను బాధ పడ్డాను. నాలో ఉన్న ప్యాషన్ గుర్తించకుండా పెదనాన్నని అడ్డు పెట్టుకుని హీరో అయిపోవాలనుకుంటున్నట్లు భావిస్తున్నారేమిటి అనుకున్నాను. అలా అయితే నేను తెలుగులో హీరో కానని చెప్పి నేనెవరో తెలియని చోట హీరో అవుతా అని చెప్పి తమిళం నుంచి అరంగేట్రం చేయడానికి రెడీ అయిపోయా.
యుక్త వయసుకు వచ్చాక చెన్నైకి వెళ్లి అక్కడే ప్రయత్నాలు మొదలుపెట్టా. ఆ టైంలోనే నేనొక షార్ట్ ఫిలిం చేస్తే.. అది చూసి వైవీఎస్ చౌదరి గారు సంప్రదించారు. ఆల్రెడీ అప్పటికే నాకు తమిళంలో ఓ సినిమా ఓకే అయింది. అయినా చౌదరి గారు పట్టుబట్టి నన్ను టాలీవుడ్‌కు తీసుకొచ్చి సొంత సంస్థలో ‘దేవదాసు’తో హీరోగా పరిచయం చేశారు” అని రామ్ వెల్లడించాడు.
This post was last modified on August 12, 2024 10:36 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…