ఈ ఏడాది అత్యంత క్రేజ్ ఉన్న ప్యాన్ ఇండియా సినిమాల్లో దేవర, పుష్ప 2 ది రూల్ కీలకమైనవి. లీకవుతున్న టాక్ ని బట్టి వీటిలో ఒక సారూప్యత అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారింది. అదే జాతర ఎపిసోడ్లు. కొరటాల శివ, సుకుమార్ ఇద్దరూ హీరోయిజంని ఓ రేంజ్ లో ఎలివేట్ చేసేలా వీటిని తీర్చిదిద్దారని అంతర్గత సమాచారం. ముందు దేవర సంగతికొస్తే సముద్రం ఒడ్డున ఆయుధపూజ బ్యాక్ డ్రాప్ లో జూనియర్ ఎన్టీఆర్ శివాలెత్తిపోయే రేంజ్ లో పాటలో నర్తించడంతో పాటు ఫుల్ మీల్స్ అనిపించే స్థాయిలో ఒక ఫైట్ కూడా పెట్టారట. ఇప్పటిదాకా చూడని కొరటాల మాస్ దర్శనం ఉంటుందని వినికిడి.
పుష్ప 2లో గంగమ్మ జాతర మెయిన్ హైలైట్ గా ఉంటుందని ఎప్పటి నుంచో ఊరిస్తున్నారు. టీజర్ లో ఒక షాట్ రివీల్ చేశారు కూడా. ఈ నేపథ్యంలో క్లైమాక్స్ ఫైట్ తో పాటు రెండు పాటలు ఉంటాయని యూనిట్ టాక్. పుష్ప 1లో లేని చాలా హై మూమెంట్స్ చూడచ్చని తెగ ఊరిస్తున్నారు. పన్నెండు నిమిషాలకు పైగా సాగే ఒక యాక్షన్ ట్రాక్ చూపు కదలనివ్వదని అంటున్నారు. సో బావా అని పరస్పరం పిలుచుకునే జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇలా తెరమీద జాతర చేయబోవడం విశేషమే. సెప్టెంబర్ 27 విడుదల కాబోయే దేవరనే ఫస్ట్ కాబట్టి ఒక సస్పెన్స్ అయితే తీరిపోతుంది.
డిసెంబర్ ఇంకా దూరం ఉంది కనక బన్నీ ఫ్యాన్స్ వెయిటింగ్ చేయక తప్పదు. బిజినెస్ పరంగా ఇప్పటికే రికార్డులు సృష్టిస్తున్న దేవర, పుష్ప 2 నార్త్ మార్కెట్ లోనూ భారీ సంచలనాలు నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. రిలీజ్ డేట్లని ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకుండా పక్కా ప్లానింగ్ తో ముందుకెళుతున్నారు. ఇంకా రెండు సినిమాల షూటింగులు పూర్తి కానప్పటికీ విడుదల తేదీకి అనుగుణంగా షెడ్యూల్స్ వేసి పెట్టారు. వచ్చే నెల మొదటి వారం లోగా దేవర గుమ్మడికాయ కొట్టనుండగా, పుష్ప 2 నవంబర్ మూడో వారానికి సిద్ధమవ్వొచ్చు. చూడాలి మరి తెరమీద జాతరలు ఎలా ఉండబోతున్నాయో.
This post was last modified on August 12, 2024 1:48 pm
నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. అమిగోస్, డెవిల్…
కమ్యూనిస్టు పార్టీ సీపీఎంకు కొత్త సారథి వచ్చారు. తమిళనాడులో జరుగుతున్న 24వ అఖిల భారత మహా సభల వేదికగా.. కొత్త…
బాలీవుడ్ ఆల్ టైం టాప్ స్టార్లలో సల్మాన్ ఖాన్ ఒకడు. ఒకప్పుడు ఆయన సినిమాలకు యావరేజ్ టాక్ వస్తే చాలు.. వందల…
కలెక్షన్ల కోసం పోటీ పడే స్టార్ హీరోల అభిమానులను చూశాం కానీ ఇప్పుడీ ట్రెండ్ కటవుట్లకూ పాకింది. తమదే రికార్డుగా…
ఏపీ రాజధాని అమరావతికి ఇప్పుడు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు.. విజయవాడకు వచ్చి.. అటు నుంచి గుంటూరు మీదుగా అమరావతికి…
ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాదికార సంస్థ(శాప్) చైర్మన్ రవినాయుడు.. వర్సెస్ వైసీపీ మాజీ మంత్రి రోజా మధ్య ఇప్పుడు రాజకీయం జోరుగా సాగుతోంది.…