కోలీవుడ్ లో ఇప్పటిదాకా పలు ప్యాన్ ఇండియా ప్రయత్నాలు భారీ ఎత్తున జరిగాయి కానీ కంగువ మీదున్న అంచనాలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. సూర్య హీరో కావడం ఒక ఎత్తయితే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, యూవీ సంస్థ భాగస్వామ్యంలో స్టూడియో గ్రీన్ భారీ నిర్మాణ విలువలు హైప్ అమాంతం పెంచేశాయి. యానిమల్ తో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టిన బాబీ డియోల్ విలనిజంతో పాటు దిశా పటాని గ్లామర్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. దేవర వదులుకున్న పండగ డేట్ అక్టోబర్ 10ని అందుకున్న కంగువ ఎలా ఉండబోతోందనే ఉత్సుకత అందరి కళ్ళు ట్రైలర్ వైపు తిప్పేలా చేసింది.
ఎప్పుడో శతాబ్దాలనాటి కథ. నాగరిక ప్రపంచం ఏర్పడక ముందు దట్టమైన అడవిలో అటవీ తెగల జీవన పోరాటంలో నెత్తుటితో అధికారం కోసం పాకులాడే దుర్మార్గుడు (బాబీ డియోల్) ఒకడు. వందల వేల ప్రాణాలు గాలిలో, సముద్రంలో కలిసిపోతూ ఉంటే వాడిని ఎదిరించడానికి కంగువ (సూర్య) వస్తాడు. యుద్ధంలో సై అంటే సై అంటూ సవాల్ విసురుతూ తనను నమ్ముకున్న జాతికోసం తలలు నరికేందుకు సైతం వెనుకాడడు. నిత్యం ప్రమాదాలతో బ్రతికే కంగువ లక్ష్యం ఏంటి, మనం ఎన్నడూ చూడని ప్రపంచంలో తను చేయబోయే విధ్వంసం ఎలా ఉండబోతోందో తెరమీద చూడాలి.
ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో విజువల్స్ అబ్బురపరిచేలా ఉన్నాయి. దేవీశ్రీ ప్రసాద్ అద్భుతమైన నేపధ్య సంగీతానికి తోడు విఎఫెక్స్ ఎఫెక్ట్స్ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. స్టోరీ ఎక్కువ రివీల్ కాకుండా తెలివిగా కట్ చేసిన ట్రైలర్ లో అసలు విషయాలు దాచి పెట్టారు. గతంలో వచ్చిన పోస్టర్ లోని సూర్య కొత్త గెటప్ తాలూకు డీటెయిల్స్ ఏవీ ఇందులో లేవు. విడుదలకు దగ్గర మరో కొత్త ట్రైలర్ రాబోతోంది. వెట్రి పళనిస్వామి ఛాయాగ్రహణంతో సాంకేతిక విభాగాలు పోటీ పడ్డాయి. థియేటర్ అనుభూతిని డిమాండ్ చేసే కంగువ కోసం ఫ్యాన్సే కాదు సగటు మూవీ లవర్స్ సైతం ఎదురు చూసేలా మెప్పించారు.
This post was last modified on August 12, 2024 1:38 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…