తమిళంతో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉన్న విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం సెప్టెంబర్ 5 విడుదలకు రెడీ అవుతోంది. వాయిదా పడొచ్చేమోననే వార్తలను కొట్టివేస్తూ నిర్మాణ సంస్థ త్వరలోనే ప్రమోషన్లను వేగవంతం చేయబోతోంది. ఆగస్ట్ 15 తంగలాన్ హడావిడి తగ్గాక జనాలు గోట్ జపం జపించేలా ప్లాన్ చేస్తోంది. వసూళ్లతో రికార్డులు సృష్టించే విజయ్ తో ఈసారి ఒక అరుదైన ఫీట్ చేయించాలని ఈ సినిమా బృందం సంకల్పించుకుందట. భవిష్యత్తులో ఇంకెవరికి సాధ్యం కాని రీతిలో చేయబోయే ప్రయత్నానికి ఇప్పటి నుంచే రెడీ అవుతున్నారట.
అదేంటంటే తమిళనాడులోని ప్రతి థియేటర్లో రిలీజ్ రోజు కేవలం ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం మాత్రమే ప్రదర్శించేలా ఎగ్జిబిటర్లతో మాట్లాడుతున్నట్టు తెలిసింది. ఇప్పటిదాకా ఏ హీరోకి ఇది సాధ్యం కాలేదు. రన్నింగ్ లో ఉన్న తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం సినిమాలు ఏవి ఆడుతున్నా సరే వాటిని తీసేసి అయిదో తేదీ గోట్ తోనే మారుమ్రోగిపోయేలా స్కెచ్ వేస్తున్నారట. బయ్యర్ల సహకారం ఉంటే కనక ఇప్పటిదాకా సౌత్ లో వచ్చిన ప్యాన్ ఇండియా మూవీస్ అన్నింటిలో హయ్యెస్ట్ ఓపెనింగ్ దక్కడం ఖాయమని టీమ్ నమ్ముతోంది. ఇదెంత వరకు సాధ్యమవుతుందో చూడాలి.
గతంలో లియోని ఇదే తరహాలో రిలీజ్ చేయాలని చూశారు కానీ సాధ్యపడలేదు. అయితే విజయ్ రాజకీయ ప్రవేశం ముందు నటించబోయే చివరి రెండు సినిమాల్లో గోట్ ఒకటి కాబట్టి చిరకాలం గుర్తుండిపోయేలా చేస్తారట. తమిళనాట సుమారుగా రెండు వేలకు పైగా స్క్రీన్లు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ సెప్టెంబర్ 5న అయిదు షోల చొప్పున గోట్ మాత్రమే స్క్రీనింగ్ చేస్తే షో కౌంట్ తో పాటు వసూలయ్యే కలెక్షన్ ఊహకందని విధంగా ఉంటుంది. అయినా ఆర్ఆర్ఆర్, బాహుబలి, కెజిఎఫ్ లాంటి వాటికే సాధ్యం కానిది ఈ గోట్ చేస్తుందేమో చూడాలి. ఈ సైంటిఫిక్ థ్రిల్లర్ లో హీరోయిన్ మీనాక్షి చౌదరి.
This post was last modified on August 10, 2024 9:44 pm
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…