Movie News

నన్ను అతడు అమ్మేస్తాడన్నారు-తాప్సి

టాలీవుడ్లో కెరీర్ మొదలుపెట్టి బాలీవుడ్లో పెద్ద రేంజికి ఎదిగిన కథానాయిక తాప్సి పన్ను. ప్రస్తుతం బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు. తాప్సి వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. బ్యాడ్మింటన్ ప్రిమియర్ లీగ్‌కు ప్రచారకర్తగా వ్యవహరించిన టైంలో డెన్మార్క్ ప్లేయర్ మథియాస్ బోతో ఆమె ప్రేమలో పడడం.. చాలా ఏళ్ల పాటు వాళ్ల రిలేషన్‌షిప్‌ కొనసాగడం తెలిసిన విషయమే. ఈ మధ్యే వీళ్లిద్దరూ రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో చడీచప్పుడు లేకుండా పెళ్లి చేసేసుకున్నారు.

ఇలా సింపుల్‌గా, హడావుడి లేకుండా సెలబ్రెటీలు పెళ్లి చేసుకోవడం కొత్త కాదు. కానీ పెళ్లి జరిగి నెలలు గడుస్తున్నా.. ఒక్క ఫొటో కూడా బయటికి రాలేదు. నిజంగా వీరి పెళ్లయిందా అనే సందేహాలు కలిగాయి జనాలకు. ఐతే తర్వాత తాప్సి పెళ్లి విషయాన్ని ఖరారు చేసింది కానీ.. తమ వివాహానికి సంబంధించి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసే ఉద్దేశం తనకు లేదని ఆమె స్పష్టం చేసింది.

పెళ్లి తర్వాత తాప్సి, మథియాస్ కలిసి కనిపించింది కూడా లేదు. కానీ తమ వైవాహిక జీవితం సాఫీగా సాగిపోతోందని చెప్పిన తాప్సి.. మథియాస్‌తో తన బంధం గురించి చాలామందికి ముందు నుంచి సందేహాలున్నాయిని చెప్పింది. ఒక సమయంలో మథియాస్ తనను దుబాయ్‌లో అమ్మేస్తాడంటూ స్నేహితులే హెచ్చరికలు జారీ చేసినట్లు ఆమె వెల్లడించింది.

“మేం 11 ఏళ్ల కిందట తొలిసారి కలిశాం. ఏడాది తర్వాత ప్రేమలో పడ్డాం. తక్కువ కాలంలోనే మేం రిలేషన్‌షిప్‌లో అడుగు పెట్టాం. తొమ్మిదేళ్ల పాటు కలిసి ఉన్నాక పెళ్లి చేసుకున్నాం. జీవితాంతం కలిసి ఉండగలం అనిపించాకే పెళ్లి వైపు అడుగులు వేశాం. ఐతే మథియాస్ డెన్మార్క్ చెందిన వాడు కావడంతో అతను ప్రపోజ్ చేసినపుడు చాలా సందేహాలు కలిగాయి. అతను అందంగా, తెల్లగా ఉంటాడు కదా.. నన్నెందుకు ఇష్టపడుతున్నాడు అనుకున్నా. కొన్ని రోజులకు తన ప్రేమ అర్థమైంది. మా ఫస్ట్ డేట్‌కు మథియాస్ దుబాయ్‌కి వెళ్దాం అన్నాడు. అదే మాట నా స్నేహితులతో చెబితే.. జాగ్రత్త, దుబాయ్‌లో ఎవరికైనా అమ్మేస్తాడు అని వార్నింగ్ ఇచ్చారు. కానీ మథియాస్ ఎంత మంచివాడో నాకు తెలుసు కాబట్టి అతడితో సాగిపోయా” అని తాప్సి చెప్పింది.

This post was last modified on August 9, 2024 11:50 am

Share

Recent Posts

మెగాస్టార్ లిస్టులో వద్దనుకున్న పేరుందా

కాకా జనవరిలో సంక్రాంతి పండక్కు వచ్చేస్తుంది. తక్కువ గ్యాప్ లో విశ్వంభర దిగుతుంది. తర్వాత ఎవరితో సినిమా ఉంటుందనేది చిరంజీవి…

24 minutes ago

నటనలో కేర్‌టేకర్‌… జనం మెచ్చిన నానా పటేకర్

బాలీవుడ్ సుప్రసిద్ధ నటుడు నానా పటేకర్ కన్ను మూయడం ఇండస్ట్రీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. 75 వయసులో చివరి…

3 hours ago

ఇన్నేళ్ళ తర్వాత శ్రీమంతుడు రీమేకా?

కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కినన్ని రీమేక్‌లు మరే భాషలోనూ వచ్చి ఉండవు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు, తమిళంలో హిట్టయిన…

5 hours ago

లెజెండరీ నటుడు నానా పటేకర్ కన్నుమూత!

ప్రముఖ నటుడు నానా పటేకర్ గురువారం కన్నుమూశారు. గోవాలోని తన నివాసంలో తీవ్ర గుండెపోటుకు గురైన ఆయనను వెంటనే సమీపంలోని…

6 hours ago

‘రణబాలి’ నేర్చుకున్న ‘ప్యారడైజ్’ పాఠం

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమాకు రిలీజ్ ముందు రోజు రాత్రి…

6 hours ago

ఖైదీకి గోల్డ్ మెడల్.. జైల్లోనే చదివి డిగ్రీలో టాప్‌!

కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి విద్యపై ఆసక్తి, పట్టుదల తోడైంది. దీంతో చదువులో అత్యుత్తమ ఫలితాలను సాధించి ఇతర ఖైదీలకు…

7 hours ago