సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు తమ హీరో మీద ప్రేమ చూపించే విషయంలో నెక్స్ట్ లెవెల్ కు వెళ్లిపోతున్నారు. ఎమోషనల్ గా హెవీ సెంటిమెంట్ ఉన్న మురారి రీ రిలీజ్ ప్రకటించినప్పుడు దానికి ఈ స్థాయిలో స్పందన వస్తుందని ఎవరూ ఊహించలేకపోయారు. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా మొదటి రోజు మూడు కోట్లకు దగ్గరగా గ్రాస్ వసూలు కావొచ్చనే ట్రేడ్ అంచనా నిజమయ్యే దిశగా టికెట్ల అమ్మకాలు జరగడం ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. బెంగళూరు లాంటి నాన్ తెలుగు రాష్ట్రంలో ఉదయం ఆరు గంటలకు షోలు వేసినా హౌస్ ఫుల్ కావడాన్ని ఏమనాలి.
ఇదంతా ఒక ఎత్తు అయితే థియేటర్లను మహేష్ ఫ్యాన్స్ కళ్యాణ మండపాలుగా మార్చేశారు. కటవుట్ల దగ్గర మంగళ తోరణాలు కట్టించి, మామిడాకులు, కొబ్బరాకులతో డెకరేషన్ చేయించి ఓ జంట సౌకర్యవంతంగా కూర్చునే ఏర్పాట్లు చేశారు. క్లైమాక్స్ కు ముందు వచ్చే అలనాటి రామచంద్రుడు పాటకు చుట్టుపక్క సీట్లలో ఉన్న వాళ్లందరికీ తలంబ్రాలు పంచి, పట్టుపంచె ధారణలో ఉన్న ఒక అభిమానితో ఇంకో ఫ్యాన్ కి ఉత్తుత్తి తాళి కట్టించడం ద్వారా సంబరాన్ని ఇంకో స్థాయిలో జరుపుకుంటున్నారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ కావడం మొదలైపోయి ఇతరులూ ఫాలో అయిపోతున్నారు.
ఇక హాళ్ల బయట జరుగుతున్న హంగామా గురించి చెప్పనక్కర్లేదు. ఎప్పుడో ఇరవై సంవత్సరాల కంటే పాత సినిమాకు ఇంత స్పందన రావడం చూసి ఎవరికి నోటమాట రావడం లేదు. ముఖ్యంగా హైదరాబాద్, తిరుపతి లాంటి నగరాల్లో హంగామా కొత్త రిలీజ్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంది. రాజమౌళితో ప్యాన్ వరల్డ్ మూవీ కోసం ఎలాగూ తమ హీరో రెండు మూడేళ్లు త్యాగం చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇలా అయినా బిగ్ స్క్రీన్ మీద మహేష్ ని సెలెబ్రేట్ చేసుకోవాలని ఫ్యాన్స్ బలంగా డిసైడయ్యారు. మూడుసార్లు రీ రిలీజైన ఒక్కడుకి సైతం నిన్న సోల్డ్ అవుట్ బోర్డులు కనిపించడం కొసమెరుపు.
This post was last modified on August 9, 2024 12:09 pm
ఇప్పుడంతా ఇంటర్ నెట్ ప్రపంచం. కొన్ని నిముషాలు మొబైల్ డేటా లేకపోయినా, ఇంట్లో వైఫై పనిచేయకపోయినా ఏదో భూమి బద్దలైపోయి…
ఈ సోషల్ మీడియా కాలంలో పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించి కూడా ఆన్ లొకేషన్ ఫొటోలు, వీడియోలు లీక్ అయిపోతుంటాయి.…
ముందో విడుదల తేదీ అనుకుని పోటీ వల్ల వెనుకడుగు వేసి ఇప్పుడు కొత్త డేట్ పట్టుకునేందుకు కిందా మీద పడుతున్న…
https://youtu.be/zHiKFSBO_JE?si=HDSpx4GNEhcOje0y కొత్త సంవత్సరం తొలి ప్యాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ జనవరి 10 విడుదల కాబోతున్న నేపథ్యంలో అందరి…
టీమిండియా స్టార్ క్రికెటర్ శుభ్మన్ గిల్తో పాటు యువ క్రికెటర్లు సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, మోహిత్ శర్మలు ఓ…