నిన్న బెంగళూరులో పవన్ కళ్యాణ్ అడవులను దోచుకునేవాళ్లను హీరోలుగా చూపించడం గురించి చేసిన కామెంట్ చాలా దూరం వెళ్ళింది. ఈ మధ్యలో ఇలాంటి సబ్జెక్టుతో వచ్చిన సినిమా పుష్ప ఒకటే కాబట్టి అది అల్లు అర్జున్ ని ఉద్దేశించిందనే కోణంలో పలువురు విశ్లేషణలు చేశారు. దీంతో సోషల్ మీడియాలో ఈ టాపిక్ మీద మెగాభిమానులు వర్సెస్ బన్నీ ఫ్యాన్స్ పరస్పరం వాదనలు చేసుకుంటున్నారు. నిజానికి పవన్ కావాలని ఏదో కించపరచాలని, జాతీయ అవార్డు సాధించిన ఐకాన్ స్టార్ ని ఏదో టార్గెట్ చేయాలనే ఉద్దేశంతో అన్న మాటలైతే ఖచ్చితంగా కాదు. అర్థం వేరేలా వెళ్లిపోయింది అంతే.
నిజానికి చట్టవ్యతిరేకత పనులు చేసే వ్యక్తుల కథలను హీరోలుగా చూపించడం కొత్తేమి కాదు. ఆల్ టైం క్లాసిక్స్ లో పేరు తెచ్చుకున్న కమల్ హాసన్ నాయకుడులో హీరో వీర్ నాయుడు పోలీస్ ఆఫీసర్ హత్యతో మొదలుపెట్టి ఎన్నో ఇల్లీగల్ దందాలు చేస్తాడు. అవన్నీ మంచి కోసమే. వాల్తేరు వీరయ్యలో చిరంజీవి చేసేది చట్టం దృష్టిలో తప్పుగా నిలిచే కల్లు వ్యాపారమే. దుల్కర్ సల్మాన్ కురూప్ లో నేరాలు చేసి దేశవిదేశాలు తిరిగినా అతన్ని పట్టుకోవడం ఎవరి వల్లా కాదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి కానీ వీటి వల్ల హింస గ్లోరిఫై అయ్యిందని కానీ, క్రైమ్ రేట్ పెరిగిందని కానీ చెప్పలేం.
ఒకప్పుడు సద్దుదేశాలతో హీరో లక్ష్యం ఉంటే ఇప్పుడు తప్పు చేసినా ఒప్పే అనే రీతిలో క్యారెక్టర్లు రాస్తున్నారని, అయినా పోషించక తప్పడం లేదనేది పవన్ చెప్పాలనుకున్న పాయింట్. దాన్ని కేవలం పుష్పకే ఆపాదించడం కరెక్ట్ కాదనేది ఒక లాజిక్. ఆ మాటకొస్తే పంజా, గుడుంబా శంకర్ లో పవన్ చేసింది సంఘసేవ కాదుగా అనే తర్కాన్ని కాదనలేం. కేవలం రాజకీయ ఉద్దేశాలతో పవన్ ప్రసంగాన్ని వక్రీకరించి దాన్ని మెగా వర్సెస్ అల్లుగా మార్చాలనే ప్రయత్నమైతే సోషల్ మీడియా వేదికగా బలంగా జరుగుతోంది. దాన్ని పసిగట్టి ఫ్యాన్స్ వాస్తవాలు తెలుసుకుంటే ఇదసలు చర్చించాల్సిన టాపిక్కే కాదు.
This post was last modified on August 9, 2024 9:41 am
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్‌లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…