పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడు సినిమాలను మధ్యలో ఆపగా.. అందులో అన్నింటికంటే ముందు మొదలైన చిత్రం హరిహర వీరమల్లు. దీని తర్వాత అనౌన్స్ అయిన రెండు చిత్రాలు పూర్తయి విడుదల కాగా.. ఇంకో రెండు చిత్రాలు సెట్స్ మీదికి వెళ్లాయి. కానీ హరిహర వీరమల్లు మాత్రం ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఏడాది కిందటే ఈ సినిమా హోల్డ్‌లో పడిపోయింది. తర్వాత ఎన్నికల హడావుడి మొదలై సినిమా గురించి ఏ ఊసూ వినిపించలేదు.
ఐతే పవన్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం అయిన నేపథ్యంలో కొన్ని నెలలు గ్యాప్ తీసుకుని సినిమాల షూటింగ్‌లో పాల్గొంటానని ప్రకటించిన నేపథ్యంలో ఆయన కోసం పెండింగ్‌లో ఉన్న మూడు సినిమాల మేకర్స్ ఎదురు చూస్తున్నారు. ముందు అనుకున్నట్లు ఓజీని కాకుండా హరిహర వీరమల్లును పవన్ రీస్టార్ట్ చేస్తారని వార్తలొస్తున్న సంగతి తెలిసిందే.
ఈ ప్రచారానికి ఊపు తీసుకొస్తూ హరిహర వీరమల్లు టీం ఇప్పుడో అప్‌డేట్ ఇచ్చింది. ఈ చిత్రంలో బాలీవుడ్ లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్ నటిస్తున్న విషయాన్ని ప్రకటించారు. పవన్ కళ్యాణ్, అనుపమ్ కాంబో గురించి ఎగ్జైట్ అవుతూ వీరి కలయికలో సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ అప్‌డేట్‌తో పాటు ఈ చిత్రానికి మనోజ్ పరమహంసను కొత్త కెమెరామన్‌గా తీసుకున్నట్లు వెల్లడించారు. క్రిష్ దర్శకుడిగా ఉండగా ఛాయాగ్రహణ బాధ్యతలు రాజశేఖర్ చూశారు. ఇప్పుడు క్రిష్ స్థానంలోకి నిర్మాత ఎ.ఎం.రత్నం తనయుడు జ్యోతికృష్ణ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో కెమెరామన్ కూడా మారారు.
వీరమల్లు టీం ఇప్పుడీ అప్‌డేట్స్ ఇచ్చిందీ అంటే త్వరలోనే షూట్ పునఃప్రారంభం కాబోతోందని భావిస్తున్నారు. పవన్ డేట్లు ఇవ్వడం ఆలస్యం పార్ట్-1కు సంబంధించి మిగతా సన్నివేశాలను వేగంగా చిత్రీకరించి.. వీలైనంత త్వరగా సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. వచ్చే వేసవిలో ఈ చిత్రం విడుదలయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి.
This post was last modified on August 9, 2024 9:38 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…