ఆగస్ట్ 29 విడుదల కాబోతున్న సరిపోదా శనివారంకు అదే వారంలో పోటీ లేదు కానీ సరిగ్గా వారం తిరక్కుండానే సెప్టెంబర్ 5 రిలీజయ్యే విజయ్ ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం (గోట్) నుంచి సమస్య తప్పేలా లేదు. నిజానికి ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు బ్యాలన్స్ ఉండటంతో ముందు చెప్పిన డేట్ కి రాదేమోననే అందరూ అనుకున్నారు. కానీ వాళ్ళ అంచనాలకు భిన్నంగా గోట్ ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చే నెల మొదటి వారానికే రావాలని పక్కా ప్రణాళికతో ఉందట. ఈ నెల మూడో వారంలో ట్రైలర్ లాంచ్ తో ప్రమోషన్ల వేగం పెంచబోతున్నట్టు చెన్నై టాక్. మరి నానికి చిక్కేమిటనే పాయిటుకొద్దాం.
సరిపోదా శనివారం తమిళంతో సహా ప్రధాన భాషల్లో ప్యాన్ ఇండియా రిలీజ్ జరుపుకుంటోంది. మంచి టాక్ వస్తే కనీసం రెండు మూడు వారాల మంచి రన్ ఉంటుంది. అందులోనూ ఎస్జె సూర్య మెయిన్ విలన్ గా చేయడంతో కోలీవుడ్ ట్రేడ్ లోనూ మంచి డిమాండ్ నెలకొంది. అలాంటిది గోట్ వస్తే ఆటోమేటిక్ గా బజ్ అటు వైపుకి షిఫ్ట్ అయిపోతుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ విజయ్ క్రేజ్ తక్కువ లేదు. తుపాకీ నుంచి వారసుడు దాకా హిట్టు ఫ్లాపు పక్కనపెడితే మార్కెట్ పెరగడమే కానీ తగ్గడం జరగలేదు. పై పెచ్చు కమర్షియల్ గా అన్నీ సేఫ్ అవుతున్నాయి. సో గోట్ కి క్రేజ్ ఎక్కువుంటుంది.
పాటల పరంగా ట్రోలింగ్ బారిన పడిన గోట్ లో విజయ్ డ్యూయల్ రోల్ చేయగా స్నేహ, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. జీన్స్ ప్రశాంత్, ప్రభుదేవా కీలక పాత్రలు పోషించారు. నాగచైతన్యకు కస్టడీ లాంటి డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడు వెంకట్ ప్రభుకి దొరికిన మంచి ఛాన్స్ ఇది. విజువల్ ఎఫెక్ట్స్ కి పెద్ద పీఠ వేసిన గోట్ లో డీ ఏజింగ్ టెక్నాలజీ వాడి విజయ్ వయసుని అమాంతం తగ్గించడం కోసమే ఎనిమిది కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. సో సరిపోదా శనివారంకు యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ వస్తేనే విజయ్ గోట్ ని తట్టుకోవడం సులభమవుతుంది. నాని టీమ్ నమ్మకమైతే ఆ స్థాయిలోనే కనిపిస్తోంది.
This post was last modified on August 8, 2024 6:59 pm
వైసీపీ ఖాళీ అవుతుంది.. ఈ మాటలు తరచుగా వినిపిస్తున్నాయి. అయితే.. పోయే వారిని పోనీ.. అన్నట్టుగానే పార్టీ అధినేత జగన్…
అర్జున్ రెడ్డితో విజయ్ దేవరకొండ సంపాదించుకున్న యూత్ ఫాలోయింగ్ కి అదనంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని జోడించిన బ్లాక్ బస్టర్…
"హలో... ఐ యామ్ చిట్టి. స్పీడ్ వన్ టెరా హెర్ట్జ్, మెమరీ వన్ జెట్టా బైట్!" రజనీకాంత్ రోబో సినిమాలో…
మొన్నటిదాకా వరస డిజాస్టర్లతో మార్కెట్ రిస్క్ లో పడేసుకున్న సూర్య మాములు కంబ్యాక్ ఇవ్వలేదు. అసలు పెద్దగా అంచనాలు లేకుండా…
టాలీవుడ్ స్టార్ హీరోల కొడుకులకు చిన్నతనంలోనే సినిమా పురుగు కుట్టేస్తుంది. బాల నటుడిగానే అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. ఆ కోవలోనే…
మహిళలు మీసాలు పెంచలేరని.. పురుషులు గర్భాన్ని దాల్చలేరని సామెత!. అయితే.. ఇటీవల కాలంలో రష్యాకు చెందిన ఓ మహిళ మీసాలు…