ఈ రోజు కర్ణాటకకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అక్కడ జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన కొన్ని విషయాలు ఆసక్తి రేపేలా ఉన్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ ప్రస్తావన తెచ్చిన పవన్ దశాబ్దాల క్రితం కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ నటించిన గంధద గుడి సినిమాను గుర్తు చేసుకున్నారు. అందులో హీరో పాత్ర అడవుల సంరక్షణ కోసం పాటుపడేలా ఉంటుందని, దాన్ని చూసే తనకు అటవీ సంపద ఎంత విలువైందో అర్థమయ్యిందని, ఇప్పుడు చిత్రాల తీరు చూస్తే దొంగ రవాణా చేసే వాళ్లనే హీరోలుగా చూపించే పరిస్థితి తలెత్తిందని పరోక్షంగా పుష్పని గుర్తు చేశారు.
నిజానికి పవన్ మాటల్లో ఎలాంటి ఇతర ఉద్దేశాలు లేకపోయినా అడవులను దోచుకునే ముఠాలు ఏపీ, కర్ణాటక, తమిళనాడులో పేట్రేగిపోతున్న వైనాన్ని వివరించే ఉద్దేశంతో ఉదాహరణలు చెప్పారు. 1973లో రిలీజైన గంధద గుడి అప్పట్లో శాండల్ వుడ్ ట్రెండ్ సెట్టర్. దీన్ని కొంత స్ఫూర్తిగా తీసుకునే రాఘవేంద్రరావు 1977లో ఎన్టీఆర్ అడవిరాముడు తీశారు. రెండింట్లోనూ కథానాయకులు ఫారెస్ట్ ఆఫీసర్లు కావడం గమనించాల్సిన విషయం. ఈ మూవీనే శివ రాజ్ కుమార్ ఒకసారి రీమేక్ చేయగా పునీత్ చనిపోక ముందు నటించిన ఒక ఫారెస్ట్ డాక్యుమెంటరీ అదే టైటిల్ తో 2022లో విడుదలైంది.
ఆపై చాలా సినిమాలు గంధదగుడిని ఆధారంగా చేసుకుని వచ్చాయి. అయితే స్మగ్లర్లు హీరోలుగా చూపించడం గురించి చెప్పిన పవన్ తాను ఇండస్ట్రీకి చెందిన వాడినే అయినప్పటికీ కొన్ని తప్పక చేయాల్సి వస్తుందనే రీతిలో అనడం గమనార్షం. చిత్తూరు సరిహద్దు ప్రాంతాల్లో రైతులకు నష్టం కలిగిస్తున్న ఏనుగుల సమస్య గురించి కర్ణాటక అటవీ శాఖా మంత్రితో చర్చలు జరిపేందుకు బెంగళూరు వెళ్లిన పవన్ కన్నడ మీడియాతో సుదీర్ఘంగా చర్చించారు. రాజకీయ అంశాలు పక్కనపెడితే గంధదగుడి ప్రస్తావన తీసుకురావడం ద్వారా రాజ్ కుమార్ అభిమానుల మనసులు గెలిచేసుకున్నారు.
This post was last modified on August 8, 2024 6:45 pm
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…