అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ నిశ్చితార్థం వార్త నిన్న రాత్రి నుంచే చక్కర్లు కొడుతున్నప్పటికీ నాగార్జున అధికారికంగా ఫోటోలు పంచుకున్నాక ఒక్కసారిగా సోషల్ మీడియా ఊగిపోయింది. గత రెండేళ్లుగా వీళ్ళ బంధం గురించి ఫోటోలు, లీకులు వస్తున్నప్పటికీ అఫీషియల్ ముద్ర పడ్డాక నెటిజెన్ల ఉత్సాహాన్ని ఆపడం ఎవరి తరం కాదు. రకరకాల మీమ్స్ ఇప్పటికే చక్కర్లు కొడుతున్నాయి. అలాని ఇవి కేవలం ఈ జంటకు మాత్రమే పరిమితం కావడం లేదు. చైతుతో విడాకులు తీసుకున్న సమంత ప్రస్తావన తెచ్చి మరీ ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు వీడియోలు, కంటెంట్లు వదులుతున్నారు.
పరిస్థితి ఎక్కడిదాకా వెళ్లిందంటే సింప్లీ సౌత్ అనే పేరున్న ఓటిటి యాప్ మజిలీ సినిమాలోని సామ్ బ్రేకప్ సాంగ్ ని అదే పనిగా షేర్ చేసుకుని మరీ ట్రెండింగ్ కోసం ఎదురు చూసేంత. సంస్థలే ఇలా చేస్తుంటే ఇక సగటు నెటిజెన్లు ఊరుకుంటారా. నరసింహలో రమ్యకృష్ణ లాగా సామ్ ఇప్పుడు చైతు శోభిత ఫోటోలు చూస్తుంటుందని ఒకరు, లేదూ సంతోషంగా ఎక్కడో విదేశాల్లో పాట పాడుకుంటూ ఎంజాయ్ చేస్తుంటుందని మరొకరు ఇలా రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇంకొందరు అడుగు ముందుకేసి శోభిత, చైతు, సామ్ గతంలో పెట్టిన ట్వీట్లు పోస్టులను తవ్వితీరి మరీ విశ్లేషణలు చేస్తున్నారు.
ఇవన్నీ ఎలా ఉన్నా మోస్ట్ వాంటెడ్ సెలబ్రిటీ వెడ్డింగ్ గా చైతు వివాహ వేడుక సంచనలం సృష్టించడం ఖాయం. పెళ్లి ఎప్పుడని నాగ్ చెప్పలేదు కానీ ఈ ఏడాదిలోగానే ఆ లాంఛనం పూర్తి చేసే ఆలోచనలో రెండు కుటుంబాలు ఉన్నాయట. కాకపోతే గతంలో గ్రాండ్ గా కాకుండా సింపుల్ గా చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. అఖిల్ ఎంగేజ్ మెంట్, చైతు సామ్ వివాహం రెండూ అంగరంగ వైభవంగా జరిపించడం అక్కినేని ఫ్యామిలీకి అచ్చిరాలేదు. అందుకే చైతు శోభితల పరిణయ వేడుక పరిమిత అతిథుల మధ్య జరిగే అవకాశాన్ని కొట్టిపారేయలేం. చూడాలి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.
This post was last modified on August 8, 2024 5:22 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…