టాలీవుడ్ మొత్తంలో పేరున్న సెలబ్రెటీల్లో సోషల్ మీడియాలో అత్యంత యాక్టివ్‌గా ఉండేది ఎవరు అంటే మరో మాట లేకుండా హరీష్ శంకర్ పేరు చెప్పేయొచ్చు. తన సినిమాల అప్‌డేట్స్ పంచుకోవడమే కాదు.. అభిమానులతో తరచుగా ఇంటరాక్ట్ అవుతుంటాడు హరీష్. ఇంకా రకరకాల అంశాల మీద తన అభిప్రాయాలు చెబుతుంటాడు.
ఐతే హరీష్ యాక్టివ్‌గా ఉండడం వల్లో ఏమో.. తన సినిమాలకు సంబంధించిన హరీష్‌ను ట్యాగ్ చేసి ట్రోల్ చేసేవాళ్లు కూడా ఎక్కువే. ఇలాంటి సందర్భాల్లో అభిమానుల మీద ఒక విరుచుకుపడే ఒక ట్విట్టర్ అకౌంట్ మీద కొన్ని సందేహాలున్నాయి. అది హరీష్ శంకర్ బ్యాకప్ అకౌంట్ అని.. హరీషే ఆ అకౌంట్ ద్వారా వచ్చి అభిమానులతో గొడవ పడుతుంటాడని.. బూతులు మాట్లాడాతడని ట్విట్టర్లో ఎప్పట్నుంచో ఒక డిస్కషన్ నడుస్తోంది. ఈ విషయమై తాజాగా ఒక ఇంటర్వ్యూలో హరీష్ శంకర్ క్లారిటీ ఇవ్వడం విశేషం.
తనకు ట్విట్టర్లో ఆల్టర్నేట్ అకౌంట్లు మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదని హరీష్ శంకర్ ఈ ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు. “నా గురించి తెలిసి కూడా ఇలా అనుమానం వ్యక్తం చేయడం తప్పు. నేను చాలా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిని. ఎవరినైనా ఏమైనా అనాలన్నా, గొడవ పడాలన్నా నేరుగానే ఆ పని చేస్తా. ఎన్నోసార్లు ట్విట్టర్లో అలా చాలామంది సమాధానం ఇచ్చా. నేను వేరే అకౌంట్ వేసుకొచ్చి ఎవరినీ తిట్టాల్సిన అవసరం లేదు. మీరు చెబుతున్న అకౌంట్ నా వీరాభిమానిది. నన్ను ఏమైనా అంటే అతను ఊరుకోడు. అతడితో నేరుగా ఒకసారి మాట్లాడాను కూడా. బూతులు వాడడం ఎందుకు అని. నేనైతే వేరే అకౌంట్ ఏదీ మెయింటైన్ చేయట్లేదు. సైబర్ క్రైమ్ వాళ్లను సంప్రదించి కావాలంటే ఈ విషయం రూఢి చేసుకోవచ్చు. నేను ఏదైనా ఓపెన్‌గానే చేస్తాను” అని హరీష్ శంకర్ స్పష్టం చేశాడు.
This post was last modified on August 8, 2024 2:54 pm
బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీమంత్రి కేటీఆర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం ఒకరిద్దరి చేతుల్లో ఉంటే.. ఇలాంటి…
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…