మహి.వి.రాఘవ్.. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడితను. ‘పాఠశాల’ అనే రోడ్ మూవీతో అతను తొలి ప్రయత్నంలోనే అభిరుచి ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత హార్రర్ కామెడీ జానర్లో భిన్నంగా చేసిన ‘ఆనందో బ్రహ్మ’ అతడికి మంచి కమర్షియల్ సక్సెస్ అందించింది. ఆపై ఎవ్వరూ ఊహించని విధంగా ‘యాత్ర’ అనే పొలిటికల్ బయోపిక్ తీసి ఆశ్చర్యపరిచాడు మహి. దీనికి కొనసాగింపుగా తీసిన ఈ ఏడాది ‘యాత్ర-2’ మూవీతో పలకరించాడు మహి.
రాజకీయ అంశాలు, ఉద్దేశాలను పక్కన పెడితే ఈ రెండు కథలను అతను డీల్ చేసిన విధానం మాత్రం ఆకట్టుకుంది. ఐతే ఇలాంటి అభిరుచి ఉన్న దర్శకుడి నుంచి పొలిటికల్ సినిమాల కంటే మామూలు చిత్రాలు చూడాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ అతను ఆ ప్రయత్నమే చేయబోతున్నాడు.
తన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘ఆనందో బ్రహ్మ’కు మహి సీక్వెల్ తీయబోతుండడం విశేషం. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లబోతోంది. ‘ఆనందో బ్రహ్మ’లో ప్రధాన పాత్ర పోషించిన తాప్సీనే ఇందులో కూడా లీడ్ రోల్ చేయబోతోందట.
‘ఆనందో బ్రహ్మ’ చేసే సమయానికి తాప్సి జస్ట్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్. అప్పుడప్పుడే బాలీవుడ్లో అడుగు పెడుతోంది. తర్వాతి కొన్నేళ్లలో అక్కడ ఆమె పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోయింది. బాలీవుడ్లో స్థిరపడ్డాక మధ్యలో ‘మిషన్ ఇంపాజిబుల్’ అనే చిన్న చిత్రంలో నటించింది తాప్సి. ఆ సినిమా తర్వాత మళ్లీ ఇటు వైపు చూడలేదు. తనకు ‘ఆనందో బ్రహ్మ’ లాంటి సక్సెస్ అందించిన దర్శకుడితో మళ్లీ ఆ సీక్వెలే చేసే అవకాశం రావడంతో తాప్సి ఇంత బిజీలోనూ తెలుగు సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. మరి పార్ట్-1లో నటించిన శ్రీనివాసరెడ్డి కూడా ఇందులో నటిస్తాడేమో చూడాలి.
This post was last modified on August 8, 2024 2:47 pm
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…