తమిళ అనువాద చిత్రాలతోనే కాక.. తెలుగులోనూ స్ట్రెయిట్‌గా నటించి మంచి పేరు సంపాదించిన అమ్మాయి ప్రియ భవానీ శంకర్. ఒకప్పుడు టీవీ ప్రెజెంటర్‌గా ఉన్న ప్రియ.. తమిళంలో వైభవ్ హీరోగా చేసిన ‘మెయ్యాదమన్’తో కథానాయికగా పరిచయం అయింది. ఆ చిత్రం సూపర్ హిట్ అయ్యాక చాలా అవకాశాలు వచ్చాయి.
తెలుగులో సంతోష్ శోభన్ సరసన ‘కళ్యాణం కమనీయం’తో పాటు నాగచైతన్య పక్కన ‘దూత’ వెబ్ సిరీస్‌లోనూ కీలక పాత్ర పోషించింది. ఇటీవలే విశాల్ మూవీ ‘రత్నం’, కమల్ మూవీ ‘ఇండియన్-2’లతో ఆమె తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ అమ్మాయి సినిమాల్లోకి అరంగేట్రం చేసే సమయానికే ఓ రాజ్ అనే అబ్బాయితో రిలేషన్‌షిప్‌లో ఉంది. ఆ విషయాన్ని ఆమె ఏమీ దాచిపెట్టలేదు కూడా. ఎప్పటికప్పుడు ఈ విషయమై హింట్ ఇస్తూనే వస్తోంది.
ఈ మధ్యే వీళ్లిద్దరూ కలిసి ఓ కొత్త ఇల్లు కొనుక్కుని అందులో గృహప్రవేశం చేసి ఆ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అప్పుడే వాళ్ళిద్దరూ త్వరలో పెళ్లి చేసుకుంటారని అర్థమైంది. ఇప్పుడు ఈ విషయాన్ని ప్రియ అధికారికంగా ప్రకటించింది. తను, రాజ్ వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నామని ఆమె చెప్పింది.
రాజ్ తన చిన్న నాటి స్నేహితుడని, తమ ఇద్దరి బంధం గురించి ఎప్పుడో వెళ్లడించినప్పటికి, తామిద్దరూ ఎక్కువ కాలం కలిసి ఉండమని చాలామంది సందేహాలు వ్యక్తం చేశారని.. కానీ తమ బంధం ఎంతో బలమైందని, అది పెళ్లి వైపు అడుగులు వేస్తోందని ఆమె చెప్పింది.
తాను సినిమాల్లోకి వచ్చాక ఎవరైనా హీరోకు సోషల్ మీడియాలో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పినా కూడా ఆ హీరోని పెళ్లి చేసుకోబోతున్నారా అని అడిగేవారని.. ఆ హీరోకు పెళ్లి అయి ఉన్నా పట్టించుకోకుండా కామెంట్ చేసే వారని ప్రియ వాపోయింది. ఇదిలా ఉండగా ఇటీవల వచ్చిన ఇండియన్ -2 సినిమాకు సంబంధించి తనను, టీంను ట్రోల్ చేసినపుడు తానెంతో బాధ పడ్డానని ప్రియ తెలిపింది.
This post was last modified on August 7, 2024 4:52 pm
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ విజయం తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తనదైన స్టైల్లో స్పందించారు. 2027 వరల్డ్…
సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో బెస్ట్ మూవీస్ అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు భాష, నరసింహ, దళపతి. వీటిని…
తాను చేసింది మహా పాపమే అంటూ.. పరకామణి చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు రవికుమార్ తెలిపారు. ఈ వ్యవహారంలో…
బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీమంత్రి కేటీఆర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం ఒకరిద్దరి చేతుల్లో ఉంటే.. ఇలాంటి…
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…