మెగా ఫ్యామిలీ నుంచి బోలెడంత మంది హీరోలు వచ్చారు. వారిలో చాలా వరకు సక్సెస్ అయ్యారు. కానీ ఆ ఫ్యామిలీ నుంచి కెమెరా ముందుకు వచ్చిన ఏకైక అమ్మాయి.. కొణిదెల నిహారిక. ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం లాంటి చిత్రాల్లో కథానాయికగా నటించిన నిహారికకు ఒక్క సక్సెస్ కూడా దక్కలేదు. తమిళంలో ఆమె నటించిన ఓ చిత్రం కూడా సరిగా ఆడలేదు. దీంతో నటనకు దూరం కావాల్సి వచ్చింది. ఈ మధ్య ఒక వెబ్ సిరీస్‌లో కనిపించినా దాని వల్ల కూడా పెద్దగా ప్రయోజనం లేకపోయింది.
ఇలాంటి సమయంలో ఆమె తన అక్క సుశ్మిత బాటలోనే నిర్మాతగా అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. నిహారిక ప్రొడక్షన్లో తెరకెక్కిన తొలి చిత్రం.. కమిటీ కుర్రాళ్ళు. అందరూ కొత్త వాళ్లను పెట్టి యాదు వంశీ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఈ నెల 9న ‘కమిటీ కుర్రాళ్ళు’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో నిహారిక మీడియాతో మాట్లాడుతూ.. ఈ మధ్య బాగా పని చేస్తున్న ‘మెగా’ సెంటిమెంటు తనకు కూడా కలిసొచ్చి నిర్మాతగా విజయాన్ని అందుకుంటానని ఆశాభావం వ్యక్తం చేసింది. “చరణ్ అన్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ వరకు వెళ్లింది. అక్కడ రెండు అవార్డులు కూడా సంపాదించింది. పెదనాన్న చిరంజీవి గారికి పద్మవిభూషణ్ పురస్కారం దక్కింది. మా బాబాయి డిప్యూటీ సీఎం అయ్యారు. మొత్తంగా మా మెగా ఫ్యామిలీకి ఈ మధ్య బాగా కలిసొస్తోంది. అదే బాటలో నేను కూడా నిర్మాతగా ‘కమిటీ కుర్రాళ్ళు’తో విజయాన్నందుకుంటాను” అని నిహారిక పేర్కొంది.
నిజానికి ‘కమిటీ కుర్రాళ్ళు’ చిత్రంలో పేరున్న నటీనటుల్ని పెట్టుకుందామని తాను దర్శకుడు వంశీకి చెప్పానని.. కానీ కొత్తవాళ్లతో చేద్దామని అతనన్నాడని.. అదే సినిమాకు ప్లస్ అయిందని.. ఈ చిత్రంతో 15 మంది టాలెంటెడ్ యాక్టర్లను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నందుకు గర్వంగా ఉందని నిహారిక చెప్పింది.
This post was last modified on August 6, 2024 9:25 pm
దేశంలో వందల సంఖ్యలో పార్టీలు ఉన్నాయి. జాతీయ, ప్రాంతీయ పార్టీలు చాలానే ఉన్నాయి. కానీ, ఏ పార్టీ చేయని పని..…
అతడులో తనికెళ్ళ భరణి చెప్పే ఫేమస్ డైలాగు ఒకటుంది. బ్రహ్మాజీతో మాట్లాడుతూ ఇన్ని బళ్ళు ఎందుకురా బుజ్జి అంటాడు. బాలీవుడ్…
ఇప్పటి మన జీవిత విధానం చాలా వేగంగా మారిపోయింది. ఏదైనా తినాలనిపిస్తే కేవలం ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే సరిపోతుంది. కొన్ని…
ఖేల్ రత్న అవార్డులు: గుకేశ్, మను బాకర్ సహా నలుగురికి గౌరవం భారత ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను మేజర్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన అభిమానులకు అద్భుత సందేశం ఇచ్చారు. తనను అభిమానిం చేవారు... తప్పకుండా పాటించాలని…
ఇండియాస్ హైయెస్ట్ బడ్జెట్, మోస్ట్ హైప్డ్ మూవీకి ఈ రోజే ముహూర్త వేడుక ముగిసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు…