తమిళంలో ఇప్పుడు ఎవరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే మరో మాట లేకుండా అనిరుధ్ రవిచందర్ పేరు చెప్పేయొచ్చు. దశాబ్దం కిందట టీనేజీలో మొదలైన అతడి సంగీత ప్రయాణం.. ఆరంభం నుంచే టాప్ గేర్‌లో నడుస్తోంది. అక్కడ దాదాపు అందరు టాప్ స్టార్ల సినిమాలకూ అతను సంగీతం అందించాడు. కత్తి, వేదాలం, వీఐపీ, మాస్టర్, విక్రమ్, జైలర్ లాంటి సినిమాలకు అతను అందించిన పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తన పాటలు, స్కోర్ ఓవైపు కొత్తగా అనిపిస్తూనే మాస్‌ను ఒక ఊపు ఊపేశాయి. చూస్తుండగానే అందరు సంగీత దర్శకులనూ వెనక్కి నెట్టేసి టాప్ రేంజికి వెళ్లిపోయాడు అనిరుధ్. అతడికి తెలుగులోనూ మంచి క్రేజ్ వచ్చింది. కానీ తెలుగులో అతను తన స్థాయి సంగీతం ఇవ్వలేదనే చెడ్డ పేరు ఉంది.
తొలి సినిమా ‘అజ్ఞాతవాసి’తోనే నిరాశపరిచిన అనిరుధ్.. గ్యాంగ్ లీడర్, జెర్సీ సినిమాలతో ఓకే అనిపించాడు. ఐతే ఆ సినిమాల ఆల్బమ్స్, స్కోర్ క్లాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి కానీ.. ఇక్కడి మాస్ ఆడియన్స్‌ను మాత్రం అనిరుధ్ ఆకట్టుకోలేకపోయాడు. ‘దేవర’తో ఆ లోటు తీర్చేస్తాడనే అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాకు అనిరుధే సంగీతం అందించాలని సోషల్ మీడియాలో ఉద్యమాలు చేసి మరీ ఆ కోరిక తీర్చుకున్నారు తారక్ ఫ్యాన్స్. కానీ ఈ సినిమా పాటలు ఒక్కొక్కటిగా రిలీజవుతుంటే.. అనిరుధ్ మీద నెగెటివిటీ పెరుగుతోంది తప్ప తగ్గట్లేదు.
ఇప్పటిదాకా రిలీజ్ చేసిన రెండు పాటలు బాలేవు అనలేం. కానీ అవి రెండూ కాపీ పాటలనే ముద్ర వేసుకున్నాయి. మొదట రిలీజ్ చేసిన ‘ఫియర్’ సాంగ్ ‘లియో’లోని ‘బడాస్’ పాట లాగే అనిపించింది. ఇప్పుడు రిలీజ్ చేసిన మెలోడీకి సోషల్ మీడియాలో పాపులర్ అయిన ఓ పాటకు చాలా పోలికలు కనిపించాయి. తమిళంలో ఎంతో కొత్తదనం చూపించే అనిరుధ్.. తెలుగు సినిమాలకు వచ్చేసరికి ఇలా చేస్తున్నాడేంటి, మన సినిమాలంటే అతడికి లైటా అనే చర్చ నడుస్తోంది సోషల్ మీడియాలో.
This post was last modified on August 6, 2024 10:34 pm
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…
బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ తాండవం 2 మొదటి మూడు రోజులు మంచి వసూళ్లే రాబట్టినా,…
డిసెంబరు బాక్సాఫీస్కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…
‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదా. ఆ తర్వాత ఆమెకు మంచి మంచి…
అలియా భట్ ఎలా అన్ని బాధ్యతలను బ్యాలెన్స్ చేస్తుందో చూసి చాలామందికి ఆశ్చర్యమే. కొత్త ఇల్లు, సినిమాలు, బిజినెస్ పనులు,…
రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న మోహన్ లాల్ ప్యాన్ ఇండియా మూవీ వృషభ డిసెంబర్ 25 మళయాళంతో పాటు తెలుగులోనూ సమాంతరంగా…