ఒక భాషలో విజయవంతమైన సినిమాను వేర్వేరు భాషల్లో రీమేక్ కావడం మనం ఎప్పట్నుంచో చూస్తున్నాం. దృశ్యం లాంటి కొన్ని సినిమాలు అన్ని భారతీయ ప్రధాన భాషల్లో రీమేక్ అయ్యాయి. ఆ చిత్రం విదేశీ భాషల్లో సైతం రీమేక్ కావడం విశేషం.
ఐతే ఇప్పుడో సినిమా ఏకంగా 26 భాషల్లో రీమేక్ అయి. 27వ భాషలోకి కూడా అడుగు పెట్టేస్తోంది. ఆ చిత్రమే.. పర్ఫెక్ట్ స్ట్రేంజర్స్. ఇదొక ఇటాలియన్ మూవీ. 2016లో ఆ భాషలో విడుదలైంది. యూరప్‌లో ఘనవిజయం సాధించిన ఈ చిత్రాన్ని తర్వాత ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల్లో అధికారికంగానే రీమేక్ చేశారు. రష్యన్, ఫ్రెంచ్, కొరియన్.. ఇలా పలు భాషల్లో ఈ చిత్రాన్ని పునర్నిర్మించారు. అన్ని చోట్లా మంచి ఫలితమే రాబట్టింది.
ప్రపంచంలో అత్యధిక భాషల్లో అధికారికంగా రీమేక్ అయిన చిత్రంగా పర్ఫెక్ట్ స్ట్రేంజర్స్ గిన్నిస్ బుక్ రికార్డ్స్‌లో చోటు సంపాదించడం విశేషం. మరో విశేషం ఏంటంటే.. ఈ సినిమా ఆధారంగా తెలుగులో రిచి గాడి పెళ్లి అనే చిన్న సినిమా కూడా తెరకెక్కింది. ఆ సినిమా పెద్దగా పాపులర్ కాకపోవడంతో జనాలు పట్టించుకోలేదు.
మలయాళంలో మోహన్ లాల్ హీరోగా దృశ్యం దర్శకుడు జీతు జోసెఫ్ ట్వల్త్ మ్యాన్ పేరుతో ఈ సినిమాను తెరకెక్కించాడు. నేరుగా ఓటీటీలో రిలీజైన ఆ సినిమా ఆశించిన స్థాయిలో స్పందన తెచ్చుకోలేదు. కాగా ఇప్పుడు హిందీలో ఈ సినిమా రీమేక్ అయింది. ఆగస్టు 15 కానుకగా విడుదల కానున్న ఆ చిత్రమే.. ఖేల్ ఖేల్ మే. అక్షయ్ కుమార్, తాప్సి, ప్రగ్యా జైశ్వాల్, వాణీ కపూర్, ఫర్దీన్ ఖాన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ముదస్సర్ అజీజ్ రూపొందించాడు.
హిందీకి తగ్గట్లుగా మార్పులు చేర్పులు, హంగులతో సినిమాను బాగానే తీర్చిదిద్దినట్లున్నారు. ఒక పెళ్లి కోసం ఒక బంగ్లాకు చేరిన మిత్రులంతా కలిసి ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడే క్రమంలో వెల్లడయ్యే విషయాల చుట్టూ మైండ్ గేమ్ తరహాలో ఈ కథ నడుస్తుంది. కథంతా చాలా వరకు ఆ బంగ్లాలోనే నడుస్తుంది. మరి ఈ థ్రిల్లర్ మూవీ హిందీ ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుంటుందో చూడాలి.
This post was last modified on August 6, 2024 9:12 pm
2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఆతిథ్యంపై నెలకొన్న అనుమానాలు ఎట్టకేలకు నివృత్తి అయ్యాయి. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లోనే…
మెగా పవర్ స్టార్ అభిమానులకు దిల్ రాజు శుభవార్త చెప్పేశారు. గేమ్ ఛేంజర్ కు పక్కా ప్లానింగ్ తో ప్రీమియర్స్…
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ వ్యక్తిగత జీవితం గురించి విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఈ రూమర్స్‌పై మరోసారి…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…
రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే అతి తక్కువ స్థాయికి చేరింది. తొలిసారి రూపాయి విలువ రూ. 85.0650కి పడిపోవడం…
బీఆర్ఎస్ హయాంలో ఫార్ములా ఈ-కార్ రేస్ నిర్వహణలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ…