దాదాపు నాలుగున్న దశాబ్దాల నుంచి సినిమాల్లో ఉన్నాడు ఆలీ. బాల నటుడిగా మొదలుపెట్టి.. కమెడియన్‌గా మంచి స్థాయిని అందుకుని.. ఒక దశలో హీరోగానూ క్రేజ్ సంపాదించుకున్నాడు ఆలీ. హీరో వేషాలు పక్కన పెట్టేశాక తిరిగి కమెడియన్‌గా ఒక హై చూశాడు. కానీ కొన్నేళ్ల నుంచి ఆలీ సినిమా కెరీర్ ఏమీ బాగా లేదు. రాజకీయాల వైపు అడుగులు వేయడం, వేరే కారణాల వల్ల సినిమాలు తగ్గిపోయాయి.
ఐతే వైసీపీలో చేరి ఐదేళ్ల పాటు ఆ పార్టీలో ఉన్న ఆలీ.. ఇటీవలే ఆ పార్టీకే కాదు, రాజకీయాలకూ గుడ్ బై చెప్పేశాడు. మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వాలనుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్‌తో స్నేహాన్ని చెడగొట్టుకోవడం, రాజకీయంగా ఒక స్టాండ్ తీసుకోవడం ఆలీ సినీ కెరీర్‌ను పరోక్షంగా దెబ్బ తీసిందనడంలో సందేహం లేదు. కానీ ఆలీ ఇప్పుడు అన్నీ వదిలేసి సినిమాల్లో బిజీ అవ్వాలనుకుంటున్నాడు. మరి ఆయనకు ముందులా అవకాశాలు దక్కుతాయా అన్నదే సందేహంగా ఉంది.
ఇలాంటి టైంలోనే ‘డబుల్ ఇస్మార్ట్’తో కమెడియన్‌గా తన కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాలనుకుంటున్నాడు ఆలీ. పూరి జగన్నాథ్ సినిమాల్లో ఒకప్పుడు ఆలీకి దక్కిన ప్రాధాన్యం.. ఆయన సృష్టించిన కామెడీ క్యారెక్టర్లో కమెడియన్‌గా ఆలీ విశ్వరూపం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, చిరుత, దేశముదురు, పోకిరి.. ఇలా చాలా చిత్రాల్లో ఆలీ కామెడీ ట్రాక్స్ ఒక ఊపు ఊపేశాయి. కొంచెం అడల్ట్ డోస్ ఉండే కామెడీ పాత్రల్లో ఆలీ చెలరేగిపోతుంటాడు.
ఐతే కొన్నేళ్ల నుంచి పూరి సినిమాల్లో ఆలీ కనిపించడం లేదు. ఆయన సినిమాల శైలి కూడా మారిపోయింది. కాగా ‘డబుల్ ఇస్మార్ట్’లో మళ్లీ ఆలీ కనిపించాడు. వీళ్లిద్దరి పాత సినిమాలను తలపించేలా ఆలీ ఒక పెక్యులర్ క్యారెక్టర్లో కనిపిస్తున్నాడు. అందులో బూతుల డోస్ బాగానే ఉంటుందని ట్రైలర్ సంకేతాలు ఇచ్చింది. కానీ వీళ్లిద్దరూ ఒకప్పటి మ్యాజిక్‌ను రీక్రియేట్ చేయగలరా అన్నదే డౌట్. అదే జరిగితే సినిమాకు ప్లస్ అవుతుంది. అలాగే ఆలీ కెరీర్ పుంజుకోవడానికీ అవకాశం లభిస్తుంది.
This post was last modified on August 5, 2024 3:11 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…