ఒకప్పుడు బాలీవుడ్ కే పరిమితమైన ప్రతిష్టాత్మక ఫిలిం ఫేర్ అవార్డ్స్ దక్షిణాదికి విస్తరించాక వాటికి మరింత క్రేజ్ వచ్చింది. దశాబ్దాల చరిత్ర కలిగిన పురస్కారాలు కావడంతో దాన్ని అందుకోవడానికి హీరో హీరోయిన్లు, దర్శక నిర్మాతలు, సాంకేతిక నిపుణులు ఉత్సాహం చూపిస్తుంటారు. నిన్న జరిగిన 2023 వేడుకల్లో విజేతలెవరో ప్రకటించేసి స్టేజి మీద ఘనంగా వాటిని అందజేశారు. న్యాచురల్ స్టార్ నాని ఉత్తమ నటుడిగా దసరాకు, అదే సినిమాలో పెర్ఫార్మన్స్ కు గాను కీర్తి సురేష్ కు ఉత్తమ నటిగా జ్ఞాపికలు అందాయి. ఉత్తమ దర్శకుడిగా బలగంతో సత్తా చాటిన వేణు యెల్దండి డెబ్యూతోనే జయకేతనం ఎగరేశాడు.
బెస్ట్ మూవీ బలగం, క్రిటిక్స్ మెచ్చుకున్న ఉత్తమ చిత్రం బేబీ, అదే విభాగంలో బెస్ట్ యాక్టర్ నవీన్ పోలిశెట్టి, బెస్ట్ యాక్ట్రెస్ వైష్ణవి చైతన్యలకు అవార్డులు వచ్చాయి. విమర్శకులు ఎంపిక చేసిన నటుల్లో రంగమార్తాండ ప్రకాష్ రాజ్ కు గౌరవం దక్కింది. సపోర్టింగ్ రోల్స్ బెస్ట్ యాక్టర్ రవితేజ (వాల్తేరు వీరయ్య), బ్రహ్మానందం (రంగమార్తాండ), సపోర్టింగ్ రోల్స్ బెస్ట్ ఫిమేల్ యాక్టర్ రూపాలక్ష్మికు పురస్కారం అందింది. ఉత్తమ తెరంగేట్రం చేసిన దర్శకులుగా నాని పరిచయం చేసిన శ్రీకాంత్ ఓదెల(దసరా), శౌర్యువ్ (హాయ్ నాన్న) ఇద్దరూ హీరో ప్రత్యక్ష హాజరులోనే ఫిలిం ఫేర్ తీసుకోవడం వాళ్ళకో మర్చిపోలేని జ్ఞాపకం.
తర్వాతి విభాగాల్లో మ్యూజిక్ ఆల్బమ్ (బేబీ), లిరిక్స్ అనంత శ్రీరామ్ (బేబీ), మేల్ సింగర్ శ్రీరామ చంద్ర (బేబీ ), ఫిమేల్ సింగర్ శ్వేతా మోహన్ (సార్), డెబ్యూ యాక్టర్ సంతోష్ శోభన్ (మ్యాడ్), సినిమాటోగ్రఫీ సత్యన్ సూరన్ (దసరా), కొరియోగ్రఫీ ప్రేమ్ రక్షిత్ (దసరా), ప్రొడక్షన్ డిజైన్ అవినాష్ కొల్ల(దసరా) లకు ఫిలిం ఫేర్ దక్కింది. వీటితో పాటు తమిళ, కన్నడ, మలయాళం పురస్కారాలు కూడా ఇచ్చారు. షూటింగుల్లో బిజీగా ఉన్న ఒకరిద్దరు ఆర్టిస్టులు తప్ప అందరూ ప్రత్యక్షంగా హాజరై మెమంటోలను స్వీకరించారు. త్వరలోనే ఈ వేడుకను ఓటిటి, శాటిలైట్ ఛానల్స్ ద్వారా విడుదల చేయబోతున్నారు.
This post was last modified on August 5, 2024 10:42 am
నటుడిగా విజయ్ దేవరకొండ.. దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగ కెరీర్లను మార్చేసిన సినిమా.. అర్జున్ రెడ్డి. ట్రెండ్ సెట్టర్ అనే…
ఇప్పుడు ఇండస్ట్రీలో వెలుగొందుతున్న చాలామంది దర్శకులు కెరీర్ ఆరంభంలో బాగా ఇబ్బంది పడ్డ వాళ్లే. సినీ పరిశ్రమలోకి వచ్చి అసిస్టెంట్…
తమిళంలో పెద్ద స్టార్‌గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ…
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…